క్రీడలు స్నేహానికి వారధులు | - | Sakshi
Sakshi News home page

క్రీడలు స్నేహానికి వారధులు

Apr 25 2026 9:36 AM | Updated on Apr 25 2026 9:36 AM

జ్యోతినగర్‌: కేంద్రీయ విద్యాలయ రీజియన్‌ క్రీడలు స్నేహానికి వారధులని రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. ఎన్టీపీసీ స్పందన క్లబ్‌ ఆడిటోరియంలో మూడు రోజుల పాటు నిర్వహించే స్పోర్ట్స్‌ మీట్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో ఆరోగ్యంతోపాటు మానసికోల్లాసం కలుగుతుందని అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదన్శనలు ఆకట్టుకున్నాయి. అండర్‌–14, 17, 19లో పోటీలు నిర్వహించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ సర్దార్‌ బాషా, ఏజీఎం సాగర్‌ రంజన్‌ సాహూ, సీఎంవో లహరి, స్పందన క్లబ్‌ అధ్యక్షుడు, జనరల్‌ మేనేజర్‌ బినోయ్‌ జోష్‌తోపాటు రీజియన్‌ పరిధిలోని 35 విద్యాలయాలకు చెందిన 137 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement