ఘోష్‌ కమిషన్‌పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు | - | Sakshi
Sakshi News home page

ఘోష్‌ కమిషన్‌పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు

Apr 24 2026 6:32 AM | Updated on Apr 24 2026 6:32 AM

పెద్దపల్లి: ఘోష్‌ కమిషన్‌పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైకోర్టు తీర్పు ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం బహిర్గతం అయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్ష సాధింపుతోనే తప్పుడు ఆరోపణలు చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని అపకీర్తి పరచాలనే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికై నా తప్పుడు ప్రచారాన్ని మానుకుని, కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన మరమ్మతులు చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఠాకూర్‌ రఘువీర్‌సింగ్‌, పట్టణ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, కౌన్సిలర్‌ రవీందర్‌ సుజాత, నాయకులు తిరుపతిరెడ్డి, సంపత్‌, మోహన్‌రావు, సందీప్‌రావు తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement