భగీరథ మహర్షి సేవలు సమాజానికి ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

భగీరథ మహర్షి సేవలు సమాజానికి ఆదర్శం

Apr 24 2026 6:32 AM | Updated on Apr 24 2026 6:32 AM

కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

పెద్దపల్లి: భగీరథ మహర్షి సేవలు సమాజానికి ఆదర్శంగా నిలిచాయని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు అన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సమాజహితం కోసం ఆనాడు భగీరథుడు అవి శ్రాంతంగా కృషి చేసి నేటి సమాజానికి ఆదర్శప్రాయుడయ్యాని కొనియాడారు. మహనీయులను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, సంఘం జిల్లా అధ్యక్షుడు మర్కు లక్ష్మణ్‌, నాయకుడు సదయ్య తదితరులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌రూరల్‌: కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సుల్తానాబాద్‌ మున్సి ఫ్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గం గణేశ్‌ అన్నారు. గురువారం సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో మాట్లాడారు. కుటుంబ, ఆస్తి తగాదా లకు సంబంధించి న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. కాట్నపల్లిలోని ఇటుకబట్టిలో కుక్కల దాడిలో బాలిక మృతి చెందడం బాధాకరమని, దీనికి యాజమాన్యాలు కార్మికులకు రక్షణ కల్పించే బాధ్యత వారిదే అన్నారు. అనంతరం బాధిత కుటుంబానికి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రూ.20వేలు, నిత్యావసర సరుకులు అందజేశారు. సర్పంచ్‌ ఓగుల పూజ, ఎంపీవో మౌనిక, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీందర్‌, ఉపాధ్యక్షుడు శివకృష్ణ, న్యాయవాదులు భూమయ్య, రాజేంద్రప్రసాద్‌, రవికిరణ్‌, కార్యదర్శి రమేశ్‌, జీపీవో దివ్య, ఉపసర్పంచ్‌ రాయమల్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

న్యాయవాదుల నిరసన

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కోర్టు భవన సముదాయాలను రాఘవాపూర్‌లో కాకుండా పెద్దపల్లిలోనే నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మేకల మల్లేశం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట చేపట్టిన నిరసన దీక్ష గురువారం 16వ రోజుకు చేరింది. బార్‌ అసోసియేషన్‌ సభ్యులు సాయికృష్ణ, క్రాంతిసింగ్‌, తాని నరేశ్‌, అజయ్‌క్రాంతిసింగ్‌, శ్రీనివాస్‌, కుమారస్వామి, శివకుమార్‌, లవన్‌కుమార్‌, శ్రీకాంత్‌, రమేశ్‌, ఆనంద్‌, అశోక్‌, సతీశ్‌, సాగర్‌, సాయికుమార్‌, నర్సింగం, సుష్మ, శిరీషరాణి తదితరులు పాల్గొన్నారు.

మేఽథోశక్తితో విద్య నేర్చుకోవాలి

సుల్తానాబాద్‌రూరల్‌: ప్రతీ విద్యార్థి మేథోశక్తితో విద్య నేర్చుకోవాలని జోనల్‌ ఇన్‌చార్జి గిరిజ అన్నారు. గురువారం సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లిలోని సాంఘీక సంక్షేమ గురుకుల వి ద్యాలయాన్ని సందర్శించారు. సెలవులపై వెళ్తున్న విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. టీజీపీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి లంకదాసరి భాస్కర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ధనలక్ష్మీ, జేవీపీ సృజన తదితరులు పాల్గొన్నారు.

కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు

కమాన్‌పూర్‌(మంథని): ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయకుండా తూకంపెట్టి మిల్లర్లకు తరలించాలని డీఆర్‌డీఏ పీడీ కళాంధిని అన్నారు. గురువారం కమాన్‌పూర్‌ మండలం గుండారంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యంరాశులు పేరుకపోవడంతో తూకం ఎందుకు పెట్టడం లేదని నిర్వాహకులను అడుగగా, మిల్లర్లను కేటాయించలేదని తెలపడంతో రెండు రోజుల్లో మిల్లర్లను కేటాయిస్తామని తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్‌లు అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలోని కుట్టుశిక్షణ కేంద్రం, వన నర్సరీని పరిశీలించారు. డీఆర్‌డీఏ వెంట ఏపీడీ రవీందర్‌, ఏపీఎం పద్మ, ఇన్‌చార్జి ఎంపీడీవో సౌమ్య, సీసీలు బిక్షపతి, మల్లయ్య, ఏపీఎం లావణ్య ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement