2025–26 విద్యా సంవత్సరం ముగిసింది. ఏప్రిల్ 24(శుక్రవారం) నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు. దీంతో చివరి రోజు గురువారం పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ప్రగతిపత్రాలు అందించి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. ఆదివారం వస్తేనే సంబురపడే విద్యార్థులు వేసవి సెలవులు ప్రకటించడంతో ఎగిరి గంతేస్తూ బాడికి టాటా చెప్పి ఇంటిబాట పట్టారు. పది నెలలు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు ఇక ఆటపాటలతో సెలవుల్లో ఎంజాయ్ చేస్తామంటున్నారు. ఎండలు విపరీతంగా ఉన్నందున ప్రయాణాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సెలవుల్లో పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సూచించారు. జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.
– పెద్దపల్లి/‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


