గోదావరిఖని: జాంబియా దేశంలో ఈనెల 26 నుంచి మే 5వరకు జరుగనున్న అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో సింగరేణి జట్టు పాల్గొంటున్నట్లు రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం మెయిన్ రెస్క్యూ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 25 జట్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో ఇండియా నుంచి నాలుగు జట్లు, జాంబియా నుంచి 4, కెనడా నుంచి 4, చైనా నుంచి 4, ఆస్ట్రేలియా నుంచి 3, కొలంబియా నుంచి 3, పొలాండి నుంచి ఒకటి, ఇండోనేషియా నుంచి ఒకటి, కోట్‌డివైర్ నుంచి ఒక జట్టు పాల్గొనబోతున్నాయన్నారు. భారతదేశం నుంచి సింగరేణి జట్టు, మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ నుంచి పురుషుల, మహిళా జట్లు, వెస్ట్రన్‌కోల్‌ఫీల్డ్స్ నుంచి ఒక జట్టు పాల్గొంటున్నాయని వివరించారు. సింగరేణి టీంకు ఫస్ట్‌ఎయిడ్ విభాగంలో డాక్టర్ రాజేశ్వర్ ప్రత్యేక చొరవ తీసుకుని శిక్షణ ఇచ్చారన్నారు. రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి, క్యాప్టెన్ ప్రమోద్‌కుమార్, బ్రీఫింగ్‌ఆఫీసర్ నితిన్‌కుమార్ పాల్గొన్నారు.
విజయధరహాసంతో తిరిగిరావాలి
జాతీయస్థాయి రెస్క్యూ పోటీల్లో రాణించిన విధంగానే అంతర్జాతీయ స్థాయి రెస్క్యూలో రాణించి సింగరేణి కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని సింగరేణి డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మెయిన్ రెస్క్యూ స్టేషన్‌లో రెస్క్యూ సభ్యులను కలిసి అభినందనలు తెలిపారు. రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్జీ3 జీఎం మధుసూధన్, ఏపీఏ జీఎం నాగేశ్వర్‌రావు, రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


