హిందూ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

హిందూ సమ్మేళనం

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

కాల్వశ్రీరాంపూర్‌: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలని చిదానందగిరి సామీజీ కోరారు. మండల కేంద్రంలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో స్వామీజీ ప్రవచించారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన నృత్యకార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

వడదెబ్బతో వలస కూలీ మృతి

ధర్మపురి: జీవనోపాధి కోసం వలస వచ్చిన కూలీ వడదెబ్బ తగిలిమృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాపట్ల జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన యోహన్‌ అలియాస్‌ మహేష్‌ (28) కూలీ పనుల కోసం ధర్మపురి వచ్చాడు. మండలంలోని కమలాపూర్‌లో బుధవారం అతిగా మద్యం సేవించాడు. వడదెబ్బకు గురై మృతి చెందాడు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

గంజాయి విక్రేత అరెస్ట్‌

ధర్మపురి:గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు ఎస్సై మహేష్‌ తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన ప్రణీత్‌కుమార్‌ గంజాయికి అలవాటు పడ్డాడు. పైగా విక్రయించేందుకు సిద్ధమయ్యారు. పట్టణంలోని పెట్రోల్‌ పంప్‌ వద్ద అనుమానాస్పదంగా వెళ్తుండడంతో పోలీసులు సోదా చేయగా అతని వద్ద 60 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని సీజ్‌ చేసి యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై తెలిపారు.

మహిళ ఆత్మహత్యాయత్నం

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌కు చెందిన ఓ మహిళ కుటుంబ గొడవలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకుంటానని పద్మనగర్లోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే పోలీస్‌, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమందించారు. వెంటనే స్పందించిన టూటౌన్‌ సీఐ సృజన్‌రెడ్డి, డివిజన్‌ ఫైర్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మహిళకు నచ్చజెప్పి కిందకు తీసుకొచ్చారు. భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement