పింఛన్ మంజూరు చేయండి
ఎస్సారెస్పీ స్థలం ఆక్రమణ
చర్య తీసుకోవాలి
ఎస్సైపై చర్య తీసుకోవాలి
పెద్దపల్లి: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. కలెక్టర్‌లే సోమవారం ప్రజావా ణి ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ వేణు హాజరయ్యారు. యైటింక్లయిన్‌కా లనీకి చెందిన కె.రాజమ్మ.. 69/ఈ సర్వేనంబరులో 26 గంటలు ఉందని, కొందరు తన సంతకం ఫోర్జరీ చేశారని, ఆ భూమిపై ఎవరికీ పట్టా చేయొద్దని వి న్నవించింది. జూలపల్లి మండలం కుమ్మరికుంటకు చెందిన ఎ.భూమయ్య.. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, ప్రభుత్వం అందించే రూ.5 లక్షలతో రేకులషెడ్డు నిర్మాణానికి వెసులుబాటు కల్పించాలని కోరింది. సుల్తానాబాద్ మండలం సుద్దాలకు చెందిన ఎస్.మదన్‌మోహన్.. ఆరేళ్లక్రి తం రైలు ప్రమాదంలో కాలు కోల్పోయానని, ది వ్యాంగుల పింఛన్‌తోపాటు అంత్యోదయ రేషన్ కా ర్డు మంజూరు చేయాలన్నాడు. పెద్దపల్లి – కూనా రం మధ్య రోడ్డు గుంతలుపడి ప్రమాకరంగా మారింని, మరమ్మతు చేయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కో ఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్‌పటేల్ కోరారు. సమస్యలు పరిశీలించిన కలెక్టర్.. వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నాది నిరుపేద కుటుంబం. దివ్యాంగుడిని. దయచేసి నాయకు దివ్యాంగుల పింఛన్ ఇప్పించండి.
– సాబీర్ హుస్సేన్, పెద్దపల్లి
ఎస్సారెస్పీ కాలువను ఆక్ర మించి సాగు చేసుకుంటున్నారు. ఆక్రమణలు ఆపా లి. ఎస్సారెస్పీ కాలువ ద్వా రా పంటలకు సాగునీరు రాకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్య తీసుకోవాలి.
– సందీప్‌రెడ్డి, బుర్హామియాపేట, ఎలాగేడు
నా ఇంటి పన్ను రూ.5,500 ఉంది. కానీ, పంచాయతీ కార్యదర్శి అదనంగా రూ. 10,500 తీసుకున్నారు. గ్రామస్తులను మోసం చేస్తు న్న పంచాయతీ సెక్రటరీపై చర్య తీసుకోవాలి.
– కరబూజ రవికుమార్, వెన్నంపల్లి
మట్టి క్వారీకి అన్ని అనుమతులు ఉన్నా పెద్దపల్లి రూరల్ ఎస్సై లారీలను ఆపివేశారు. డ్రైవర్లను బెదిరించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తగిన విచారణ జరిపి చర్య తీసుకోవాలి.
– ఎస్.రాంరెడ్డి, శాంతినగర్, పెద్దపల్లి


