ఆఫ్రికాకు సింగరేణి డాక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆఫ్రికాకు సింగరేణి డాక్టర్‌

Apr 22 2026 9:36 AM | Updated on Apr 22 2026 9:36 AM

గోదావరిఖని: ఆఫ్రికా దే శంలో జరిగే అంతర్జాతీయ మైన్స్‌రెస్క్యూ పోటీలకు జ డ్జిగా సింగరేణి డాక్టర్‌ రాజేశ్వర్‌ ఎంపికయ్యారు. ఈనె ల 25 నుంచి మే 8వ తేదీ వరకు ఆఫ్రికాలోని జాంబి యా ప్రాంతంలో జరిగే అంతర్జాతీయ మైన్స్‌రె స్క్యూ పోటీలకు సింగరేణి వైద్యుడు ఎంపిక కావడం దేశంలోనే తొలిసారి. ఈసందర్భంగా పలువురు రాజేశ్వర్‌ను అభినందించారు.

పథకాలపై అవగాహన ఉండాలి

పెద్దపల్లి: మైనారిటీల సంక్షేమ, అభివృద్ధి ప థకాలపై అవగాహన అవసరమని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రమేశ్‌కుమార్‌ నాయుడు తెలిపారు. మైనార్టీల సంక్షేమ పథకాలపై కలెక్టరేట్‌లో సోమవారం అవగాహన కల్పించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక ద్వారా మైనారి టీ మహిళలకు కుట్టుయంత్రాలు పంపిణీ చే స్తామని తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధి పై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈనెల 24న ముస్లిం ఫకీర్‌, తుర్కాకాషా కమ్యూనిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తామని అ న్నారు. వక్ఫ్‌ బోర్డు రాష్ట్ర డైరెక్టర్‌ సనా ఫారూక్‌, ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ ముషారఫ్‌, పాస్ట ర్స్‌ అధ్యక్షుడు డేవిడ్‌, అశోక్‌, రాజు ఉన్నారు.

జిల్లాకు పాఠ్యపుస్తకాలు

పెద్దపల్లి: జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభించేనాటికి పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందించాలనే లక్ష్యంతో విద్యాశాఖ ముందస్తుగానే సరఫరా ప్రారంభించింది. జిల్లాకు 2,86,233 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా ఇప్పటికే 1,54,590 వరకు చేరాయి. తొలివిడతలో వ చ్చిన పాఠ్యపుస్తకాలను అప్పన్నపేట గోదాంలో నిల్వచేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పా ఠశాలలు 576 వరకు ఉన్నాయి.

ప్రశాంతంగా ‘ఓపెన్‌’ పరీక్షలు

పెద్దపల్లి: జిల్లాలో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్మీడియట్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి శారద తెలిపారు. టెన్త పరీక్షకు 972 మంది విద్యార్థులకు 883 మంది హాజరయ్యారని, 90.84శాతం హాజరు నమోదు అయ్యిందని వివరించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షకు 1,542 మందికి 1402 మంది హాజరయ్యారని డీఈవో వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement