బసవేశ్వర ఆశయాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

బసవేశ్వర ఆశయాలు సాధించాలి

Apr 22 2026 9:36 AM | Updated on Apr 22 2026 9:36 AM

పెద్దపల్లి: సంఘసంస్కర్త, తత్వవేత్త బసవేశ్వర ఆశ య సాధనకు అందరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ వేణు అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం బసవేశ్వర జ యంతి ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ వేణు బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ, బసవేశ్వరుడు కుల వ్యవస్థ, అసమానతలు తొలగించేందుకు కృషి చేసిన గొప్ప సంస్కర్త అన్నారు. సమాజంలోని ప్రతీ వర్గం అభివృద్ధికి బసవేశ్వరుని ఆలోచనలు ఎంతో అవసరమని చెప్పా రు. జిల్లా బీసీ అభివృద్ధి అధికా రి వినోద్‌ కుమార్‌, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ వేణు

సంఘ సంస్కర్తకు ఘననివాళి

Advertisement
 
Advertisement
Advertisement