పెద్దపల్లిరూరల్: ఈ ఫొటో చూసి గూడ్స్ వ్యాన్ అనుకొవద్దు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ ఇది. అత్యవసర సమయంలో పేషెంట్లు, ప్రమాదాల్లో గాయపడ్డ వారిని దీనిద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలి. కానీ ఇందులో సామగ్రిని ఇలా లోడ్ చేయడాన్ని చూసిన పలువురు ఇదేమిటని నివ్వెరపోయారు. ఇలాంటి చర్యలు పునరావృత్తం కాకుండా చూడాలని కోరుతున్నారు.
దేశంలో శాంతి నెలకొనాలి
వేములవాడ: దేశంలో శాంతి నెలకొ ని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేములవాడ భీమన్నను మొ క్కుకున్నట్లు సినీనటి పూనమ్ కౌర్ పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలోని భీమేశ్వరస్వామి ని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. ఆమె వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ ఉన్నారు.


