మంథని: దివంగత సీఎం డాక్టర్ వైస్ రాజశేఖరరెడ్డి హయాంలో పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని మహదేవపూర్ మండలం బీరాసాగర్ వద్ద గో దావరిపై చేపట్టిన చిన్నకాళేశ్వరం(కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల) నిర్మాణంపై రైతుల్లో ఆశలు చిగు రిస్తున్నాయి. రూ.500 కోట్ల అంచనాతో 18 ఏళ్లక్రి తం ప్రారంభించిన ఎత్తిపోతల.. అటవీ, పర్యావర ణ అనుమతులు, భూసేకరణతోపాటు ఇతరత్రా కా రణాలతో ముందుకుసాగడం లేదు. ఈప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, ఐటీ, పరి శ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో ఎత్తిపోతల పూర్తికి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈక్రమంలో సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లిలో నిర్వహించిన రైతుభరోసా సభలో చిన్నకాళేశ్వరం పూర్తిచేసే బాధ్యత తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించడంతో ఈప్రాంత రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
45 వేల ఎకరాల ఆయకట్టుకు..
మంథని నియోజకవర్గంలోని మహదేవపూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాల్లోని 63 గ్రామల పరిధిలో గల 45,280 ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీరందించేందుకు 2008 సెప్టెంబర్ 19న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాళేశ్వరం ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారు. మహదేవపూర్ మండలం బీరాసాగర్ గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసేలా రూపకల్పన చేశారు. రూ.500 కోట్ల వ్యయంతో పరిపాలనా అనమతులు వచ్చాయి. ఆ తర్వాత ప్రాజెక్టు వ్యయం రూ.946 కోట్లకు చేరింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడమే కాకుండా ప్రాజెక్టు పూర్తిచేస్తానని సీఎం మాటఇవ్వడంతో చిన్నకాళేశ్వరం పనులు పరుగులు పెడతాయని రైతులు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు సైతం చిన్నకాళేశ్వరం పూర్తిచేయించి సీఎంతో ప్రారంభిస్తామని చెప్పడండో ఎత్తిపోతలపై అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నెరవేరిన వారధి కల
మంథని మండలం ఆరెంద – కాటారం మండలం దామెరకుంట మధ్య మానేరుపై 1.120 కిలోమీటర్ల పొడవునా రూ.210 కోట్ల అంచనాతో నిర్మించ బోయో వారధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. దీంతో రెండు జిల్లాల మధ్య దూరభారం తగ్గి రాకపోకలు మెరుగుకానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్దపల్లి పర్యటనకు వచ్చిన సమయంలో మంథని గోదావరి నదిపై వంతెనకు శంకుస్తాపన చేశారు. నియోజకవర్గంలో కొత్తగా రెండు వంతెనలకు సీఎం శంకుస్థాపన చేయడం విశేషం.
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
నస్తూర్‌పల్లిలో నిర్వహించిన సభకు మంథనిప్రాంతం నుంచి పెద్దఎత్తున జనం తరలివెళ్లారు. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాలు పెద్ద సంఖ్యలో వెళ్లాయి. సభ సక్సెస్ కావడమే కాకుండా కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ.200 కోట్లు, ఆరెంద వంతెనకు శంకుస్థాపన, చిన్నకాళేశ్వరం పూర్తికి సీఎం మాట ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబురం వ్యక్తం చేస్తున్నారు.
45వేల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం
ఆరెంద–దామోరకుంట వారధికి శంకుస్థాపన
కాటారం సభ సక్సెస్‌తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం


