పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి–కూనారం మధ్య లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద రైల్వే శాఖ అండర్ బ్రిడ్జి పనులు కూడా చేపట్టింది. మూడేళ్ల క్రి తం ఇదేగేటు వద్ద చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు సాగుతున్న విషయం విదితమే. దీంతోపాటు అండర్ బ్రిడ్జి కూడా నిర్మించేందుకు నిర్ణయించిన అధికారులు.. ప్రస్తుతం పనులు చకచకా సాగిస్తున్నారు. ఆర్వోబీ పైనుంచి వెళ్తే.. కిందఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకాలనీ తదితర ప్రాంత ప్రజలు వెళ్లేందుకు ఇబ్బందులు రాకుండా అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.
జేఎన్టీయూ విద్యార్థులకు ఉద్యోగాలు
రామగిరి: పెద్దపల్లి జిల్లా మంథని జేఎన్టీయూ ఫైనలియర్ విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభించాయి. ప్లేస్‌మెంట్ సాధించిన వి ద్యార్థులకు ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ సోమవా రం నియామకపత్రాలు అందజేసి అభినందించారు. జీబీబీ ప్రైవేట్ లిమిటెడ్‌లో సీఎన్‌ఎం విద్యార్థి కావలి దీక్షిత్‌కు రూ.12 లక్షల ప్యాకేజీ లభించింది. మెకానికల్ విద్యార్థిని పైడాకుల అలేఖ్యకు జిందాల్ సంస్థలో రూ. 10.3 లక్షలు, మైనింగ్ విభాగంలో యాదండ్ల శాశంక్ యాదవ్, మోహన్ గుగులోత్, మెకానికల్‌లో లోకేశ్ బోడకు రూ.4 లక్షల చొప్పున ప్యాకేజీతో ఉద్యోగాలు లభించాయి. మెకానికల్ విద్యార్థి గరిదే దేవేందర్‌కు రూ.2.6 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం దక్కింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు 107 మంది విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చినట్లు ప్రిన్సిపాల్ వివరించారు. మెకానికల్ విభాగం ప్రొఫెసర్ చెరుకు శ్రీధర్‌రెడ్డి, ప్లేస్‌మెంట్ సెల్ ఇన్‌చార్జి కావ్య, పరిపాలనాధికారి సుమన్ తదితరులు అభినందించారు.
క్వింటాల్ పత్తి రూ.8,031
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కె ట్ యార్డు ఆవరణలో పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.8,031 ధర పలికిందని మార్కెట్‌కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.6,831 గా సగటు రూ.7,631గా ధర ఉందన్నారు.


