తెలంగాణలో ఎరువులకు కొరత లేదు | - | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఎరువులకు కొరత లేదు

Apr 22 2026 9:18 AM | Updated on Apr 22 2026 9:18 AM

వానాకాలం సీజన్‌కు సరిపడా ఉత్పత్తి

సరఫరాలో ఎలాంటి ఆలస్యం ఉండదు

తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్లాంట్‌ పూర్తిసామర్థ్యంతో పనిచేయడానికి సర్కార్‌ సహకారం

రామగుండం ప్రాజెక్టులో యూరియా ఉత్పత్తి, సరఫరాపై సమీక్ష

ఫెర్టిలైజర్‌సిటీ: వచ్చేవానాకాలం సీజన్‌కు తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌ సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి ఆయన సోమవారం యూరియా ఉత్పత్తి, సరఫరాపై సమీక్షించారు. సురేంద్ర మోహన్‌ మాట్లాడుతూ, తెలంగాణకు యూరియా ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్లాంట్‌ ఎరువులు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. సమయానికి రైతులకు అందించడం అత్యంత ముఖ్యమని చెప్పారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పూర్తిసామర్థ్యంతో పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా సహకారం అందిస్తుందని కలెక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి, నిల్వలు, సరఫరాలో సమన్వయం పాటించాలని ఆయన సూచించారు. రైతుల ప్రయోజనాల కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎరువుల సరఫరాలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ప్లాంట్‌ను సందర్శించి, యూరియా ఉత్పత్తి ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్లాంట్‌ యూనిట్‌ హెడ్‌ జిందాల్‌, ప్రొడక్షన్‌ హెడ్‌ సహా, టెక్నికల్‌ సర్వీసెస్‌ హెడ్‌ సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement