బడిని బతికించుకుంటున్నారు | - | Sakshi
Sakshi News home page

బడిని బతికించుకుంటున్నారు

Apr 22 2026 9:18 AM | Updated on Apr 22 2026 9:18 AM

మంథనిరూరల్‌: సాధారణంగా ప్రభుత్వ పాఠశాల ల్లో పనిచేసే ఉపాధ్యాయు లు విధి నిర్వహణలో భా గంగా పాఠశాలకు రావడం, పాఠాలు చెప్పడం, ప్రభు త్వ కార్యక్రమాల్లో పాల్గొనడం పరిపాటి. కానీ ఓ ప్ర ధానోపాధ్యాయుడు తనకాంప్లెక్స్‌ పరిధిలోని పాఠశాల మూతబడే పరిస్థితి ఏర్పడంతో బతికించుకోవాలంటూ బడిబాటకు శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిన్న ఓదాల గ్రామపంచాయతీ పరిధి శ్రీరాములపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే చదువుకున్నారు. ఆ ఇద్దరిది ఐదో తరగతి పూర్తికావడంతో ఆరోతరగతి కోసం మరోపాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆ బడి లో విద్యార్థులు లేక మూతపడే పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న మంథని మండలం ఆరెంద జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం ఈదులపల్లి నర్సింహారా వు సోమవారం శ్రీరాములపల్లిలో బడిబాట చేపట్టా రు. ఇంటిఇంటికీ తిరుగుతూ బడిని కాపాడుకోవాలని గ్రామస్తులను వేడుకున్నారు. ఊరిలో బడి, గుడి ఉంటేనే గొప్పగా ఉంటుందని, బడి మూతపడితే ఆ ఊరికి విద్య దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది ఉన్నతస్థాయికి ఎదిగారని, మీ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాలను వివరించారు. పాఠశాల మూతపడకుండా సర్పంచ్‌ సైతం సహకారం అందించి పిల్లలను చేర్పించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నాగుల శారద – రాజయ్య, శ్రీరాములపల్లి హెచ్‌ఎం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement