కరీంనగర్‌స్పోర్ట్స్/కొత్తపల్లి: రంగారెడ్డి జిల్లా గుర్రంగూడాలో జరుగుతున్న 69వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్– 17 బాలికల క్రికెట్ పోటీలకు ఉమ్మడి చింతకుంట జెడ్పీ స్కూల్‌కు చెందిన విద్యార్థిని ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ అంతడ్పుల శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో విద్యార్థిని నాగపూర్ శృతి ప్రతిభ కనబరిచి రాష్ట్ర పోటీలకు ఎంపికై ంది. ఈసందర్భంగా శృతిని ప్రధానోపాధ్యాయురాలు తాండ్ర శోభారాణి, 14,15వ డివిజన్‌ల కార్పొరేటర్లు గడ్డి ప్రదీప్, పిట్టల జ్యోతి, ఉపాధ్యాయులు అభినందించారు.
నేత్రదానానికి అంగీకారం
కరీంనగర్: జన్మదినాన్ని పురస్కరించుకొని నేత్రదానానికి అంగీకారం తెలుపుతూ ఆదర్శంగా నిలిచారు కరీంనగర్‌కు చెందిన కోటక్ మహీంద్ర బ్యాంకు టీమ్ లీడర్ బొజ్జ అరుణ్ కుమార్. సోమవారం సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నేత్రదానానికి సంబంధించిన పత్రాలపై సంతకం చేసి పట్టణ కో కన్వీనర్ ఎస్.రాజకనకయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఐడీ కార్డు, అభినందన సర్టిఫికెట్ అందించారు. పుట్టినరోజున నేత్రదానానికి ముందుకు రావడంతో తోటి ఉద్యోగులు, యువతకు అరుణ్‌కుమార్ ఆదర్శంగా నిలిచారని ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తాడూరి కరుణాకర్, ఎన్.కనకయ్య, ఎస్.ప్రభాకర్, టి.వాసు, బి.శంకర్‌గౌడ్, బి.కిషన్, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.


