సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో విజిలెన్స్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో విజిలెన్స్‌ తనిఖీలు

Apr 22 2026 9:18 AM | Updated on Apr 22 2026 9:18 AM

గంగాధర: స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోమవారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ అధికా రులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొద్దిరోజులుగా వివాదంలో ఉంటున్న సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ లోకి ఎవరినీ రానీయకుండా తనిఖీ చేయడంతో ఏం జరుగుతుందోనని సిబ్బంది ఆందోళనకు గురయ్యా రు. గతంలో ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కగా, మరో రిజి స్ట్రార్‌ ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్‌ చేసి సస్పెన్షన్‌కు గురయ్యాడు. అప్పటి నుంచి ఏడాదికి పైగా ఇన్‌చార్జి అధికారులతోనే కొనసాగుతుంది. ప్రస్తు తం రెండుమూడు రోజులకో ఉద్యోగి ఇన్‌చార్జిగా వ స్తున్నారు. కాగా, ఇక్కడ ఇన్‌చార్జి విధులు నిర్వహించేందుకు జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం ఉద్యోగులు జంకుతున్నారు. ఈనేపథ్యంలో విజిలెన్స్‌ అండ్‌ ఎ న్ఫోర్స్‌మెంట్‌ సీఐలు అనిల్‌కుమార్‌, రవీందర్‌ భూ ముల క్రయవిక్రయాల రికార్డులు పరిశీలించారు. రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ అన్వర్‌ను అడిగి తెలుసుకున్నా రు. అధికారులు మాట్లాడుతూ, సాధారణ తనిఖీలో భాగంగానే రికార్డులు పరిశీలించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement