జ్యోతినగర్: ఎన్టీపీసీ అధికారులు, ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా శిక్షణ అందిస్తున్నా మని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కు మార్ సామంత అన్నారు. టీటీఎస్‌లోని ఉద్యో గ వికాస కేంద్రంలో మంగళవారం రామగుండం, తెలంగాణ ప్రాజెక్టులోని ఎఫ్‌టీ, ఎంజీఆ ర్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన పునశ్చర ణ, అభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తారని తెలిపారు. జనరల్ మేనేజర్లు ముకుల్ రాయ్, మనీశ్ అగర్వాల్, ఏజీఎం(సేఫ్టీ) సుప్రకాశ్ చక్రవర్తి, హెచ్‌వోచ్‌ఆర్ సాగర్ రంజన్ సాహూ తదితరులు పాల్గొన్నారు.
పడిపోతున్న నీటిమట్టం
రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమ ట్టం భారీగా పడిపోతోంది. ప్రాజెక్టు పూర్తిస్థా యి నీటినిల్వలు 20.175 టీఎంసీలు కాగా మంగళవారం 9.32 టీఎంసీలకు పడిపోయా యి. గతేడాది ఇదేరోజు 8.79 టీఎంసీలు ఉ న్నాయి. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 864 క్యూసె క్కులు రాగా, ఎన్టీపీసీ 121 క్యూసెక్కులు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 318 క్యూసెక్కులు, గూడెం ఎత్తిపోతలు 145 క్యూ సెక్కులు, మిషన్ భగీరథకు 81 క్యూసెక్కులు, వేడికి ఆవిరవుతున్న నీరు 199 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
డీఆర్‌ఎం పర్యటన
రామగుండం: సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ గోపాలకృష్ణణ్ స్థానిక రైల్వేస్టేషన్‌ను మంగళవారం సందర్శించారు. ఆర్‌వోహెచ్ షె డ్, కమర్షియల్ విభాగం, ప్లాట్‌ఫారం ఏరి యా, యార్డు, కాలనీ, పార్కింగ్ పరిసరాలు తదితర ప్రదేశాలు పరిశీలించారు. వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా కోల్‌మైన్స్ నుంచి బొగ్గు రవాణా లో ఎదురవుతున్న ఇబ్బందులు, జాప్యం తదితర అంశాలపై ఆరా తీశారు. సీఐ రాజేంద్రప్రసాద్ సిబ్బందితో బందోబస్తు చేపట్టారు.
24 నుంచి స్కూళ్లకు సెలవు
పెద్దపల్లి: పాఠశాల విద్యార్థులకు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈనెల 23 చివరి పని దినంగా వెల్లడించింది. ఒకటి నుంచి తొమ్మి దో తరగతి వరకు చివరిరోజు ప్రొగ్రెస్‌కార్డులు అందిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానుంది. అయితే, వేసవి సె లవుల్లో పాఠశాలలు, అందులోని క్రీడాసామగ్రి, కంప్యూటర్, ప్రింటింగ్ మిషన్, ఫర్నీచర్, గ్రంథాలయాలు, వాయిద్యాలు తదితర వాటి భద్రతపై ఉపాధ్యాయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాటిభద్రత, పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని అంటున్నారు.
25న జాబ్‌మేళా
పెద్దపల్లి: మెడ్‌ప్లస్ కంపెనీలో ఉద్యోగావకాశా లు కల్పించేందుకు ఈనెల 25న జాబ్‌మేళా ని ర్వహిస్తామని జిల్లా ఉపాధి కల్పనాధికారి తి రుపతిరావు తెలిపారు. 40 ఫార్మాసిస్టు, 50 ఆ డిట్ అసిస్టెంట్, 201 సెక్యూరిటీగార్డు పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి, అర్హతగలవారు ఉదయం 11 గంటల సంబంధిత సర్టిఫికెట్లతో కలెక్టరేట్‌లోని రూమ్ నంబరు 233లో తమపేరు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 89853 36947, 81212 62441 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
భూముల పరిరక్షణకు చర్యలు
ఓదెల: రైల్వే స్థలాలు ఆక్రమణకు గురికాకుండా ప్రహరీలు నిర్మిస్తున్నారు. రైలు పట్టాలకు ఇరువైపులా సిమెంటు స్తంభాలు పాతి, హ ద్దురాళ్లుగా వేస్తున్నారు. ప్రస్తుతం మూడు ట్రాక్‌లు ఉండగా.. నాలుగోలైన్ నిర్మాణానికి స్థలం కొరత ఎదురవకుండా, ఉన్న స్థలాలను పరిరక్షించేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సికింధ్రాబాద్ నుంచి కాజీపే, కాజీపే ట నుంచి బల్హార్షా మధ్య ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
క్వింటాల్ పత్తి రూ.8,068
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.8,068గా ధర నమోదైందని మార్కెట్‌కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.6,361గా, సగటు రూ.7,606గా ధర ఉందన్నారు.


