అన్నదాతకు ప్రజాప్రభుత్వం అండ | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు ప్రజాప్రభుత్వం అండ

Apr 22 2026 7:54 AM | Updated on Apr 22 2026 7:54 AM

పెద్దపల్లిరూరల్‌: ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న అన్నదాతలకు సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభు త్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం ధా న్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అడిషన ల్‌ కలెక్టర్‌ వేణు, మార్కెట్‌ చైర్మన్‌ కూర మల్లారెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్యతో కలిసి ప్రారంభించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలకులు కోతల పేరిట రైతులశ్రమను దోచుకున్నారని ఆరోపించారు. డీసీవో శ్రీమాల త దితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్‌ను కొత్తగా ని ర్మించేందుకు వీలుగా వ్యవసాయ మార్కెట్‌ ఆవర ణలో తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. చిరువ్యాపారులకు ఇ బ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌కు సూచించారు.

మద్దతు ధరకే మక్కలు, ధాన్యం సేకరణ

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

పెద్దపల్లి మార్కెట్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Advertisement
 
Advertisement
Advertisement