గోదావరిఖని/కోల్‌సిటీ/జ్యోతినగర్/గోదావరిఖనిటౌన్: రామగుండం నవ నిర్మాణంలో భాగంగా చె రువుల పునరుద్ధరణ చేపట్టామని రామగుండం ఎ మ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. అమృత్– 2 ద్వారా విడుదలైన రూ.2.53 కోట్లతో నగరంలోని మూడోడివిజన్‌లోని ప్రశాంత్‌నగర్ మల్లపు రా ణికుంట, రూ 1.81 కోట్లతో మల్కాపూర్ బామండ్లకుంట చెరువుల పునరుజ్జీవన పనులకు మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ వడ్లూరి రవితో కలిసి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అంతకుముందు హనుమాన్‌నగర్ మండల పరిషత్, అడ్డగుంటపల్లి పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, చెరువుల సుందరీకరణతోపాటు ఆహ్లాదం అందించడానికి గార్డెన్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని అన్నారు. మల్కాపూర్, ప్రశాంత్‌నగర్‌కు వరద ముప్పు రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, కార్పొరేటర్ రవి అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే మరో రూ.కోటి పనులను మంజూరు చేశా రన్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్పొరేటర్లు వెంగల బాపు, కొలని కవితారెడ్డి, చిదురాల నాగరాజు, ధూళికట్ట సతీశ్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం డీఈ నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు.
రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్


