బాధితుల పక్షాన నిలబడాలి | - | Sakshi
Sakshi News home page

బాధితుల పక్షాన నిలబడాలి

Apr 22 2026 7:54 AM | Updated on Apr 22 2026 7:54 AM

గోదావరిఖని: ఆర్‌ఎఫ్‌సీఎల్‌ బాధితుల పక్షా న రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ నిలబడాలని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్షుడు అంబటి నరేశ్‌ కోరారు. స్థానిక ప్రె స్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉ ద్యోగాల బాధితుల డబ్బులతో కొనుగోలు చే సిన భూమిని విక్రయించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఇప్పుడు దొంగల ప క్షాన నిలిచినట్లుగా అర్థమవుతోందని అన్నా రు. బాధితుల డబ్బులతో గోదావరినది ఒడ్డు న కొనుగోలు చేసిన 18 ఎకరాలకు డీటీసీపీ అనుమతి ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నా రు. రామగుండంలో చీమచిటిక్కు మన్నా ఎ మ్మెల్యేకు తెలుస్తుందని, అలాంటిది రూ.కోట్ల విలువైన భూములకు ఎమ్మెల్యేకు తెలియకుండా అనుమతి వస్తుందా? అని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉద్యోగ బాధితులు మర్రి రాములు, ఆర్‌.సత్యనారాయణ, రాకేశ్‌గౌడ్‌, సతీశ్‌, కుమారస్వామి, శ్రీకాంత్‌, నేరేళ్ల సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement