రెనే ఆస్పత్రి సౌజన్యంతో సింగరేణి ఏరియా ఆస్పత్రిలో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయించిన యాజమాన్యం.. ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే క్యాథ్‌ల్యాబ్‌కు అవసరమైన యంత్రపరికరాలను కొనుగోలు చేసిన రెనే ఆస్పత్రి యాజమాన్యం.. వాటిని అమర్చే పనిలో బిజీగా మారింది. ఇప్పటికే డాక్టర్లను కూడా నియమించుకుంది. క్యాథలైజేషన్ ల్యాబొరేటరీ, యాంజియోగ్రామ్, యాంజియో ప్లాస్టీ, స్టంట్ వేయడం, ఫేస్‌మేకర్ అమర్చడం లాంటి ఆధునిక యంత్రసామగ్రిని ఆస్పత్రిలో బిగిస్తోంది. సివిల్ పనులు, యంత్రాల బిగింగ్ తర్వాత టెస్టింగ్ ప్రక్రియ చేపడతారు.


