మంథని: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలిసారి మంథని ని యోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రకటించే వరాలపై పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. రైతుభరోసా రెండోవిడత నిధుల విడుదల కోసం కాటారం మండలం నస్తూర్‌పల్లి లో ఆదివారం నిర్వహించే బహిరంగ సభకు సీఎం హాజరవుతారు. సభ సక్సెస్ కోసం మంత్రి శ్రీధర్ బాబు తగిన ఏర్పాట్లు సిద్ధం చేశారు.
నిధుల తేవడంలో శ్రీధర్‌బాబు ముందంజ
తాను ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మంథని ఎమ్మెల్యే, ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముందుకు సాగుతున్నారు. రెండేళ్లలోనే అ నేక అభివృద్ధి పనులకు నిధులు తీసుకొచ్చారు. మిగిలిన పనులకు సైతం సీఎం రేవంత్‌రెడ్డి ద్వా రా మరిన్ని నిధులు ఇప్పిస్తారని ఈప్రాంత ప్రజ లు ఆశిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు సందర్శిస్తారని సమాచారం. కాళేశ్వరముక్తీశ్వర స్వామి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఆలయాలకు అనుసంధానంగా అభివృద్ధి చేసేందు కు ప్రతిపాదనలు సి ద్ధం చేశారు. తద్వా రా ఆలయాల అభివృద్ధి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది.
మెడికల్ కాలేజీ.. పరిశ్రమలపై ఆశలు
మంథని ప్రాంతంలో దాదాపు 50ఏళ్లుగా ఇంటికో ఇంజినీర్.. వీధికో వైద్యుడు తయారవుతున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. ప్రతిష్టాత్మక జేఎన్టీయూను కాంగ్రెస్‌పాలనలోనే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. మెడికల్ కాలేజీని సైతం మంథని లో నెలకొల్పాలని స్థానికుల కోరిక. పీజీ కాలేజీ, పోతారం లిఫ్ట్ ఇరిగేషన్, పరిశ్రమల ఏర్పాటు లాంటి ముఖ్యమైన పనులకు సీఎం నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తుందని ఆశిస్తున్నారు.
జన సమీకరణపై కసరత్తు
సీఎం సభకు నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున రైతులు, అన్నివర్గాలను తరలించేందుకు కాంగ్రెస్ శ్రేణులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం వాహనాలు సమకూర్చారు. సాయంత్రం వేళ సభ ఉండడంతో మధ్యాహ్నమే జనం తరలింపునకు ఏర్పాట్లు చేశారు. నేడు జగిత్యాలలోనూ మాజీ సీఎం కేసీఆర్ సభ ఉండడంతో ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ శ్రేణులను అక్కడకు తరలించేందుకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.
మంథనికి మరిన్ని వరాలు వస్తాయనే నమ్మకం
నేడు కాటారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
జనసమీకరణకు కాంగ్రెస్ నాయకుల కసరత్తు


