కల్లెంరెడ్డిపల్లెను పంచాయతీ చేస్తాం | - | Sakshi
Sakshi News home page

కల్లెంరెడ్డిపల్లెను పంచాయతీ చేస్తాం

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

ధర్మారం/జూలపల్లి: కల్లెంరెడ్డిపల్లిని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అభయం ఇచ్చారు. ధర్మారం మండలం కమ్మరిఖాన్‌పేట పంచా యతీ పరిధిలోని కల్లెంరెడ్డిపల్లితోపాటు జూలప ల్లి మండలంలో మంత్రి ఆదివారం పర్యటించా రు. గ్రామస్తుల సమస్యలపై స్పందించారు. జూలపల్లి మండలం సర్పంచులు ఫోరం మండల అధ్యక్షుడు తొగరు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు గ్రామస్తులు, కాంగ్రెస్‌ నాయకులు మంత్రిని కలిసి గ్రామాభివృద్ధిపై వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలోవార్డు సభ్యులు తీగెల అశోక్‌, సంకెన్ల శోభ, మాజీ ఉపసర్పంచ్‌ బొజ్జ శ్రీనివాస్‌ ఉన్నారు.

సభను విజయవంతం చేయాలి

ధర్మారం: కాటారంలో సోమవారం జరిగే సీ ఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ కోరా రు. కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా సీఎంగా ఎ న్నికై న రేవంత్‌రెడ్డిని కేటీఆర్‌, హరీశ్‌రావు ఏకవచనంతో సంబోధించడం సరికాదన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లావుడ్య రూప్లానాయక్‌, వైస్‌ చైర్మన్‌ అరిగే లింగయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, నా యకులు కొత్త నర్సింహం, అసోద అజయ్‌, కొ డారి హన్మయ్య, కాడే సూర్యనారాయణ, బొల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే ‘గీట్ల’కు నివాళి

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలోని కూనారం క్రాస్‌రోడ్డులోగల దివంగత మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి విగ్రహానికి ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పూలమాల వేసి ఘననివాళి అర్పించారు. ఆదివారం ముకుందరెడ్డి వర్ధంతి సందర్భంగా గీట్ల ము కుందరెడ్డి తనయుడు రాజేందర్‌రెడ్డితోపాటు జిల్లా గ్రంథాలయసంస్థ అధ్యక్షుడు అన్నయ్య గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌లు మల్లయ్య, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గీట్ల ఆశయాలను కొనసాగిస్తామన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రకాశ్‌రావు, కౌన్సిలర్లు మంథని నర్సింగ్‌, అమ్రేశ్‌, నాయకులు ఉప్పు రాజు, నర్సింహారెడ్డి, సురేశ్‌గౌడ్‌, యాట మల్లారెడ్డి, మస్రత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement