అయ్యప్ప సమాజ సేవలో ఏబీఏపీ | - | Sakshi
Sakshi News home page

అయ్యప్ప సమాజ సేవలో ఏబీఏపీ

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

గోదావరిఖని: అయ్యప్ప సమాజ సేవలో అఖిల భారతీయ అ య్యప్ప ధర్మ ప్రచార సభ(ఏబీఏపీ) ముందుందని సభ రాష్ట్ర గౌ రవ అధ్యక్షుడు చల్లా రవీందర్‌రెడ్డి అన్నారు. మార్కండేయకాల నీ శ్రీలక్ష్మి ఫంక్షన్‌హాల్‌లో ఏబీఏపీ జిల్లా జనరల్‌ బాడీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ట్రస్ట్‌ మెంబర్‌ బేతి తిరుమల్‌రావు, ప్రతినిధులు భూతం రాజేశ్‌, జనగామ తిరుపతి, వడ్డేపల్లి దినేశ్‌, తుమ్మ సురేశ్‌, పర్స రామస్వామి, కుమార్‌, లక్ష్మణ్‌, వామ న్‌శర్మ, ఆడెపు లక్ష్మీనారాయణ, రాములుగౌడ్‌ పాల్గొన్నారు.

జిల్లా అధ్యక్షుడిగా గంగాధర్‌

ఏబీఏపీ జిల్లా అధ్యక్షుడిగా అబ్బ గంగాధర్‌ను ఎన్నుకున్నారు. ఉ పాధ్యక్షులుగా పర్శ రామస్వామి, మారం బిక్షపతి, జనరల్‌ సెక్రటరీగా కలవేని సర్వేశ్‌, గౌరవ అధ్యక్షుడిగా వామన్‌శర్మ, పీఆర్‌ వోగా దినేశ్‌ వడ్డేపల్లి, జాయింట్‌ సెక్రటరీలుగా తిరుమలాచారి, పెగడ శ్రీనివాస్‌, వలంటరీ కమాండెంట్‌గా కొమరవెల్లి రాకేశ్‌, ట్రెజరర్‌గా కోటరాజు, కార్యవర్గ సభ్యులుగా బయ్యపు ప్రభంజన్‌రెడ్డి, జక్కుల సతీశ్‌, పిల్లి సంపత్‌, నాగండ్ల రవికుమార్‌, సిద్ధ రాధాకృష్ణ, చల్లా రవీందర్‌రెడ్డి, భూతం రాజేశ్‌, జనగామ తిరుపతి, కెక్కర్ల లింగయ్య ఎన్నికయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement