ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యం

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

గోదావరిఖని: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఫిట్‌ తెలంగాణ – ఫిట్‌ గోదావరిఖని నినాదంతో ఈనెల 26న చేపట్టిన అవంతిక తెలంగాణ ప్రొమో రన్‌లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆ సంఘం అధ్యక్షుడు సోమా జగన్మోహన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మహేశ్‌పటేల్‌ కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెట్రో నగరాలకే పరిమితమైన రన్‌ కల్చర్‌ను జిల్లాస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 10 జిల్లాల్లో ప్రొమోరన్స్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఈక్రమంలో గోదావరిఖని సింగరేణి జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఈనెల 26న 2కే, 5కే, 10కే విభాగాల్లో ప్రొమో రన్‌ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నామని తెలిపారు. 90143 97581, 94927 81306 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

రన్‌లో పాల్గొనాలి

రన్‌లో అందరూ భాగస్వాములు కావాలని గోదావరిఖని ఏసీపీ రమేశ్‌ కోరారు. సైకిల్‌పై స్టేడియానికి చేరుకుని నిర్వాహకులను కలిసి అభినందించారు. అసోసియేషన్‌ సభ్యుడు సతీశ్‌కుమార్‌, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు సానా రామకృష్ణారెడ్డి, నల్లవెల్లి శంకర్‌, సదాశయ ఫౌండేషన్‌ ప్రతినిధులు లింగమూర్తి, చంద్రమౌళి, కేఎస్‌ వాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement