నృసింహుడి నవరాత్రి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నృసింహుడి నవరాత్రి ఉత్సవాలు

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

నృసింహుడి నవరాత్రి ఉత్సవాలు ● ఈనెల 22 నుంచి 30 వరకు..

● ఈనెల 22 నుంచి 30 వరకు..

ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహుని జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని ఈవో శ్రీనివాస్‌ తెలిపారు. ఈనెల 22 నుంచి 30 వరకు చేపట్టే ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, చలువ పందిళ్లు, లడ్డూప్రసాదాలను సిద్ధం చేశారు. 22న ఉదయం 6 గంటలకు బిందే తీర్థం, 8 గంటలకు పుణ్యవచనం, కలశస్థాపన, సాయంత్రం 5 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, 25న అన్నకూటోత్సవం, 26న సహస్ర కలశాభిషేకం, 27న చందనోత్సవం, 28న పల్లవోత్సవం, వసంతోత్సవం, 29న లక్ష తులసి అర్చన, 30న స్వామివారల జయంతి ఉత్సవం నిర్వహిస్తారు.

భీమన్నకు మొక్కులు

వేములవాడ: వేములవాడ భీమన్నకు వీకెండ్‌ తాకిడి పెరిగింది. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా వివిధ ప్రాంతాలకు చెందిన 32వేల మంది భక్తులు ఆదివారం తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement