మల్లన్నకు పట్నాలు | - | Sakshi
Sakshi News home page

మల్లన్నకు పట్నాలు

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో భక్తులు ఆదివారం పోటాపోటీగా పట్నాలు వే శారు. తొలుత కొనేరులో స్నానాలు ఆచరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మల్లికార్జునస్వామి, శ్రీసీతారామచంద్రస్వామి, నందీశ్వరులు, బద్దిపోచమ్మ దర్శనం చేసుకొన్నా రు. హుండీలో కానుకలు వేశారు. తలనీలాలు సమర్పించారు. జూనియర్‌ అసిస్టెంట్‌ కుమారస్వామి భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు.

దరఖాస్తులు ఆహ్వానం

రామగుండం: ప్రస్తుత విద్యాసంవత్సరంలో టెన్త్‌, ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పది, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా కోర్సులు పూర్తిచేసినవారు అ ర్హులు. శిక్షణ(ఇంటర్న్‌షిప్‌) సమయంలో ప్రతీ అభ్యర్థికి నెలకు రూ.9,000 అందిస్తారు. శిక్షణకాలం కంపెనీలను బట్టి 6, 9, 12 నెలలు ఉంటుంది. ఆసక్తిగలవారు https://pminternsh ip.mca.gov.in లేదా myscheme.gov.in/sc hemes/pmisలో వివరాలు చేయాలి.

మద్దతు ఎందుకివ్వలేదు?

పెద్దపల్లిరూరల్‌: మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచేలా ప్రధాని సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహి ళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్‌, మిత్రపక్ష ఇండియా కూటమి ఎందుకు మద్దతు ఇవ్వలేదో స్పష్టంచేయాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య డిమాండ్‌ చేశారు. కమాన్‌వద్ద రాజీవ్‌ రహదారిపై బీజేపీ పట్టణ, మండల అధ్యక్షులు రాకేశ్‌, రమేశ్‌ ఆఽ ద్వర్యంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించా రు. రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశా రు. ఇండియా కూటమి మహిళలకు వ్యతిరేకమని తేలిపోయిందని అన్నారు. నాయకులు తంగెడ రాజేశ్వర్‌రావు, సంపత్‌రావు, శ్రీనివా స్‌, రాజగోపాల్‌, మహంతకృష్ణ, తిరుపతి, శ్రీ కాంత్‌, కిరణ్‌, శ్రీనివాసరావు, సతీశ్‌, శ్రీధర్‌, ఉమేశ్‌, కుమార్‌, శివయ్య, రాజు, హరీశ్‌, అంజి, ఆనందరావు, సంపత్‌, వేణు, రమ, శిరీష, లక్ష్మి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు యువకుల అరెస్ట్‌

మెట్‌పల్లి: మెట్‌పల్లి ప్రాంతంలో గంజాయివిక్రయిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు. మల్యాల చందు, బాణాల రాజు మెదక్‌ జిల్లా నుంచి గంజా యి తీసుకొచ్చి విక్రయిస్తున్నారని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement