ప్రమాదాలపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాలపై అప్రమత్తం

Apr 19 2026 7:29 AM | Updated on Apr 19 2026 7:29 AM

పెద్దపల్లి : వేసవిలో అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారి మ హేందర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండియ న్‌ గ్యాస్‌ గోదాంతోపాటు పలు పరిశ్రమలల్లో అగ్నిప్రమాదల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పరిశ్రమ లు, నివాసాల్లో అనూహ్యంగా ప్రమాదాలు జ రిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అధికారులు కిశోర్‌, శ్రీనివాస్‌, అనిల్‌ కుమార్‌, కోటేశ్‌ తదితరులు ఉన్నారు.

ఎన్నికలు నిర్వహించాలి

పాలకుర్తి: బసంత్‌నగర్‌ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీలో పర్మినెంట్‌ కార్మికసంఘం ఎన్నికలు ని ర్వహించాలనే డిమాండ్‌తో కన్నాల సర్పంచ్‌ మల్క రామస్వామి ఆధ్వర్యంలో శనివారం నా యకులు, కార్మికులు ఆందోళన నిర్వహించా రు. ప్రస్తుత యూనియన్‌ మూడేళ్ల పదవీకాలం ముగిసి నెలరోజులు దాటిందన్నారు. అయినా, యాజమాన్యం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించ డం లేదని అన్నారు. యూనియన్‌ నాయకులు కార్మికుల హక్కులను యాజమాన్యం ఎదుట తాకట్టు పెట్టి కాంట్రాక్ట్‌లు పొందుతూ సహకరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తగిన హా మీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించా రు. నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి, తంగెడ అ నిల్‌రావు, పీట్ల గోపాల్‌, సూర అంజికుమార్‌, కుడిక్యాల సురేశ్‌, చాంద్‌పాషా, దండుగుల లక్ష్మణ్‌, ఆడెపు శ్రీనివాస్‌, సందవేన పోషమ ల్లు, జేసీబీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

‘కేంద్రీయ’లో ప్రవేశాలు

జ్యోతినగర్‌: రామగుండంలోని ఎన్టీపీసీ కేంద్రీ య విద్యాలయంలో 11వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ సర్దార్‌ బాషా శనివారం తెలిపారు. ఈనెల 20వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కేంద్రీయ విద్యాలయం(కేవీ)లో చదివిన వారికి తొలిప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారుకూడా రిజిస్ట్రేషన్‌ చే సుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు మధ్యాహ్నం 1 గంటల నుంచి మధ్యాహం 3 గంటల వరకు కా ర్యాలయంలో సంప్రదించాలని కోరారు.

మాదిగలకు 11శాతం రిజర్వేషన్లు

పెద్దపల్లి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 15 శాతం రిజర్వేషన్లలో మాదిగలకు 11 శాతం వ ర్తింజేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపన్న, జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం వారు విలేకరుల సమావే శంలో మాట్లాడారు. మాదిగల జనాభా 10 నుంచి 11శాతం వరకు ఉంటుందని మందకృష్ణ మాదిగ ఆదినుంచీ చెబుతున్నారని, కులగణన సర్వేతో ఆ విషయం స్పష్టమైందన్నారు. నాయకులు కొంకటి లింగమూర్తి, మంథని చందుమాదిగ, మడిపల్లి దశరథం మాదిగ, కాసి పేట రాజయ్య మాదిగ, అగ్గిమల్లా కొముర య్య మాదిగ, కాసిపేట సదానందం, రాచర్ల రాజేశం, శ్రావణ్‌ మాదిగ, వివేక్‌ పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

సుల్తానాబాద్‌రూరల్‌: ట్రాఫిక్‌ నిబంధనలు పా టిస్తేనే ప్రయాణం సురక్షితంగా, సుఖవంతం ఉంటుందని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తాలో శనివారం అరైవ్‌ –అలైవ్‌ కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ హెల్మెట్‌, సీట్‌బెల్డ్‌ వినియోగం, అతివేగం, ప్రమాదాలు, గోల్డెన్‌ అవర్‌ తదితర అంశాలపై అవగాహన ఉండాలన్నారు. అనంతరం వాహనాదారులకు హెల్మెట్‌లను పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు రాధాకృష్ణ, వైస్‌ చైర్మన్‌ పుష్పలత, సీఐ సుబ్బారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ప్రకాశ్‌రావు, ఎస్సై చంద్రకుమార్‌ తదితరులు పాన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement