ఫైర్‌సేఫ్టీపై విద్యార్థులకు అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఫైర్‌సేఫ్టీపై విద్యార్థులకు అవగాహన

Apr 19 2026 7:29 AM | Updated on Apr 19 2026 7:29 AM

ఫైర్‌సేఫ్టీపై విద్యార్థులకు అవగాహన ఫెర్టిలైజర్‌సిటీ: స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఫైర్‌ సేఫ్టీ మేనేజర్‌ రవికిరణ్‌ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు ఫైర్‌సేఫ్టీపై తీసుకో వాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై విద్యార్థులతో మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎంఈవో విమల, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ● అవస్థల్లో పేషెంట్లు, ఆస్పత్రి సిబ్బంది

అద్దె ఇవ్వడం లేదని యూపీహెచ్‌సీకి తాళం

కోల్‌సిటీ(రామగుండం): అద్దె చెల్లించడం లేదనే ఆగ్రహంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్‌సీ)కు ఇంటి యజమాని తాళం వేసిన ఘటన గోదావరిఖని ఫైవింక్లయిన్‌కాలనీలో శనివా రం చోటుచేసుకుంది. ఆదర్శ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఎన్జీవో నిర్వాహకుడు నరసింహులు ఓ రేకుల షెడ్డు లో యూపీహెచ్‌సీ నిర్వహిస్తున్నారు. అద్దె ఎంతకీ ఇవ్వకపోవడంతో యజమాని రాజేశ్‌ శనివారం షెడ్డుకు తాళం వేశారు. వైద్య సిబ్బంది ఎన్జీవో ప్రతినిధులకు సమాచారం అందించారు. ఎన్జీవో నిర్వాహకుడు వెంటనే వచ్చి ఇంటి యజమానితో చర్చలు జరిపారు. రెండురోజుల్లో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తాళం తొలగించారు. కాగా, కలెక్టర్‌ చొరవతో రెండేళ్లక్రితం షెడ్డుకు సమీపంలోనే రూ.1.45 కోట్ల వ్యయంతో యూపీహెచ్‌సీ కోసం రెండతస్తుల భవనం నిర్మించారు. ఆస్పత్రికి అవసరమైన సామగ్రి సమకూర్చకపోవడంతో భవనం వినియోగంలోకి రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement