మంథని: రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఈనెల 20న కాటా రం మండలం నస్తూరిపల్లిలో నిర్వహించే రైతుభరోసా విడుదల సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హాజరవుతారని ఆయన చెప్పారు. ఈ మేరకు శనివారం మంథనిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో డివిజన్‌లోని ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వం రైతులతోపాటు అన్నివర్గాలకు మేలుచేసే కార్యక్రమాలు చేస్తోందని అన్నారు. సీఎం సభ విజయవంతం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే, మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


