పెద్దపల్లి/ఎలిగేడు: మంథని నియోజకవర్గంలోని కాటారంలో ఈనెల 20వ తేదీన జరిగే సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగసభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎ మ్మెల్యే విజయరమణారావు కోరారు. ఎలిగేడు మండలం శివపల్లిలోని తన నివాసంలో జూలపల్లి, ఎలిగేడు మండలా కాంగ్రెస్ పార్టీ నాయకులతో శుక్రవా రం విప్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరా రు. కార్యక్రమంలో ఎలిగేడు, జూలపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


