ప్రమాదాలపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాలపై అప్రమత్తం

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

పెద్దపల్లి: ఆస్పత్రుల నిర్వాహకులు, సిబ్బంది అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని ఫైర్‌ఆఫీసర్‌ మహేందర్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రల్లో అగ్ని, ఇతర ప్ర మాదాల నియంత్రణపై శుక్రవారం ఆయన అ వగాహన కల్పించారు. అనూహ్యంగా ప్రమా దం జరిగితే అప్రమత్తంగా ఉండే విధానం, మంటలను ఆర్పే పద్ధతి గురించి వివరించా రు. వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాటిని నియంత్రించడంతోపాటు జా గ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్‌, పవన్‌, సాయివిగ్నేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ను కలిసిన ‘కోలేటి’

గోదావరిఖని: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను పో లీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ శుక్రవారం కలిశారు. హైదరాబాద్‌లోని కేటీఆర్‌ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. భవిష్యత్‌ రాజకీయాలపై చర్చించారు.

నియామకం

పెద్దపల్లి: టీపీసీసీ డాక్టర్స్‌ సెల్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ విభాగం జిల్లా చైర్మన్‌గా ఇటుకల మహేశ్‌ కుమార్‌ నియమితులయ్యారు. హై దరాబాద్‌ గాంధీ భవన్‌లో మహేశ్‌ కుమార్‌కు శుక్రవారం రాష్ట్ర చైర్మన్‌ రాజీవ్‌ నియామక పత్రాన్ని అందజేశారు.

62 మందికి ఉద్యోగాలు

పెద్దపల్లి: స్థానిక టాస్క్‌ సెంటర్‌లో నిర్వహించి న జాబ్‌మేళాలో 62 మంది వివిధ ఉద్యోగాల కు ఎంపికయ్యారని జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. జిల్లా కేంద్రంలో శుక్ర వారం నిర్వహించిన జాబ్‌మేళాకు 380 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. మరో 9 మంది షార్ట్‌లిస్ట్‌ అయినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టాస్క్‌ మేనేజర్‌ గంగాప్రసాద్‌, ఇన్‌చార్జి కౌసల్య, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

పీఆర్సీ అమలు చేయాలి

పెద్దపల్లి: వచ్చేజూన్‌ 2న పీఆర్సీ అమలుచేయాలని ఉద్యోగ జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు బొంకూరి శంకర్‌, తూము రవీందర్‌పటేల్‌ కోరారు. శుక్రవారం భోజన విరామ సమయంలో కలెక్టరేట్‌ ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నగదు రహిత ఆరోగ్య భద్రత కార్యక్రమాన్ని మే ఒకటో తేదీ నుంచి నిబంధన లేకుండా అందరికీ వర్తింపజేయాలన్నారు. ప్రతినిధులు రంగారెడ్డి, కరుణాకర్‌, రవీందర్‌, గంప రవీందర్‌, బ్రహ్మానందరెడ్డి, సాజిద్‌ అలీ, రవీంద్రనాథ్‌, ఉమాదేవి, ఆడెపు శ్రీనివాస్‌, అయిరెడ్డి సందీప్‌రెడ్డి, అనిత, శిల్పారెడ్డి, సౌమ్య, స్వప్న కుమారి, రమ్య, హారిక, దివ్య, మంగ, రాజమణి, ప్రవీణ్‌, రాజమహేందర్‌, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాలికా సాధికారతకు కృషి

జ్యోతినగర్‌: బాలికా సాధికారతకు ఎన్టీపీసీ ఎంతోకృషి చేస్తోందని ప్రాజెక్టు ఏజీఎం(హెచ్‌ఆర్‌) సాగర్‌రంజన్‌ సాహూ అన్నారు. కాకతీయ ఆడిటోరియంలో శుక్రవారం బాలికా సాధికారత మిషన్‌ –2026 ద్వారా చేపట్టిన సమగ్ర వైద్య పరీక్ష శిబిరంలో ఆయన మాట్లాడారు. బాలికల సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సును నిర్ధారించడం, ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించడం శిబిరం ముఖ్య ఉద్దేశమన్నారు. ఎంపికై న 120 మంది బాలికలకు వేసవిలో ప్రత్యేక శిబిరంలో పూర్తిసౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీజీఎం ప్రవీణ్‌ కే చౌదరితోపాటు వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement