ప్రభుత్వ కళాశాలల్లో చేరండి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కళాశాలల్లో చేరండి

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

● నాణ్యమైన విద్యాబోధన ● అత్యుత్తమ ఫలితాలు ● మెరుగైన సౌకర్యాలు ● ప్రచారంలో అధ్యాపకులు

పెద్దపల్లి: కార్పొరేట్‌ కళాశాలలకు ఏమాత్రం తీసి పోని విధంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అ త్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. విద్యార్థులు అత్యధిక మార్పులు సాధిస్తున్నారు. వీటితోపాటు అన్నికాలేజీల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నాయి. అందుకోసమే ఈసారి కూడా సర్కారు కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్‌ ప్రచారం చేస్తున్నారు.

పేదలకు ఉచిత విద్య

జిల్లాలో వ్యాప్తంగా 14 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలోని 5,079 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ప్రభుత్వ, కేజీబీవీలు, జెడ్పీ హైస్కూళ్లు, గురుకులాల్లోనూ ప్రవేశాలకోసం అధ్యాపకులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఈఏడాది ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత 68.29 శాతం నమోదుచేశాయి.

ఎంసెట్‌, నీట్‌లో ప్రత్యేక శిక్షణ

విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల కోసం ఎంసెట్‌, నీట్‌, జేఈఈ మెయిన్స్‌ వంటి పరీక్షల కోసం శిక్షణ ఇస్తున్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు అందిస్తున్నారు. ప్రణాళిక బద్ధంగా విద్యార్థులను ప్రిపేర్‌ చేస్తున్నారు.

తరగతి గదుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

ఇంటర్‌ బోర్డు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో ప్రతీ తరగతి గదిని అనుసంధానించారు. ఇందుకోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని సామాజిక వర్గాలకు ఉన్నతాధికారులు స్కాలర్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. మధ్యాహ్న భోజనం, అల్పాహారం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రభుత్వ కాలేజీలో చేరుతా

నేను పదో తరగతి పాసైన. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చేరు తా. ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, విద్య అందిస్తుంది. మాలాంటి పేదలకు ఇది ఒక వరం. – జాన్‌, సుల్తానాబాద్‌

కళాశాలలో చేరండి

ఇంటర్‌ బోర్డు ఆదేశం మేరకు ప దోతరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్‌లో చేరేలా ప్రచారం చేస్తున్నాం. తల్లిదండ్రులు, విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. వారినుంచి మంచిస్పందన వస్తోంది.

– రామచంద్రారెడ్డి, ప్రిన్సిపాల్‌, సుల్తానాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement