కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని జనరల్ ప్రభుత్వ ఆస్పత్రి(జీజీహెచ్)ను కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుధ్యం నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ ఓపీ, న్యూబ్లాక్, ఐసీయూ బ్లాక్, ఎమర్జెన్సీ విభాగం, డ్యూటీ డాక్టర్ గదులను పరిశీలించారు. పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో చేపట్టిన సీసీ రోడ్డు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. శానిటేషన్ పనితీరును మెరుగుపరచాలని చెప్పారు. డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ, ఆర్‌ఎంవోలు కృపాబాయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
పెద్దపల్లి: జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇందుకోసం అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూ చించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షించారు. ఆయుర్వేదం, హోమియోపతి తదితర సేవలపై ప్రజల స్పందన, రోజువారీ ఓపీ సంఖ్య వివరాలపై ఆరా తీశారు. యోగా కేంద్రాలఏర్పాటు కోసం స్థలాలు అన్వేషించాలని అన్నారు. హెచ్‌పీవీ టీకా ప్రగతి తక్కువగా ఉందని, వచ్చే రెండు నెలల్లో 6 వేల టీకాలు పూర్తిచేయాలని అన్నారు. అబార్షన్ ఆడిట్ తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పారు. డయాలిసిస్ పేషెంట్లకు నిరంతర సేవలు అందించాలన్నారు. జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, డీసీహెచ్‌వో శ్రీధర్, డాక్టర్లు వాణిశ్రీ , శ్రీరాములు, రాజమౌళి, సుధాకర్‌రెడ్డి, కృష్ణమోహన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


