త్వరలోనే క్యాథ్‌ల్యాబ్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

త్వరలోనే క్యాథ్‌ల్యాబ్‌ సేవలు

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

● సూపర్‌స్పెషాలిటీ కేంద్రంగా సింగరేణి ఏరియా ఆస్పత్రి ● చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కిరణ్‌రాజ్‌కుమార్‌

గోదావరిఖని: కోల్‌బెల్ట్‌వాసులకు త్వరలోనే క్యాథ్‌ల్యాబ్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఈమేరకు పనులు శరవేగంగా సాగుతున్నాయని సింగరేణి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కిరణ్‌రాజ్‌కుమార్‌ అన్నారు. గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో చేపట్టిన క్యాథ్‌ల్యాబ్‌ విభాగాన్ని ఆర్జీ–వన్‌ జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. గుండె సంబంధిత వ్యాధులను నిర్ధారించడం, చికిత్స చేయడంలో ఈవిభాగం కీలకంగా పనిచేస్తుందన్నారు. క్యాథ్‌లాబ్‌తో పాటు కార్డియాలజిస్టులు(గుండె వైద్య నిపుణులు), ప్రత్యేక శిక్షణ పొందిన నర్సింగ్‌ స్టాఫ్‌ అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. రామగుండం సింగరేణి ఏరియా ఆస్పత్రి సాధారణ వైద్యానికే కాకుండా, సూపర్‌ స్పెషాలిటీ సేవల కేంద్రంగా కూడా మారుతుందని చెప్పారు. ఎస్‌వోటూ జీఎం చంద్రశేఖర్‌, సివిల్‌ డీజీఎం వరప్రసాద్‌, వర్క్‌షాప్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌, హాస్పటల్‌ ఏసీఎంవో అంబిక, సీనియర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వీరారెడ్డి, డాక్టర్‌ రమేశ్‌, రెనీ హాస్పిటల్‌ చైర్మన్‌ బంగారు స్వా మి, డైరెక్టర్‌ అరవింద్‌, వైద్య సిబ్బంది, క్యాథ్‌లాబ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement