జ్యోతినగర్: గోల్డెన్ అవర్‌లో స్పందిస్తే రోడ్డు ప్రమా ద బాధితుల ప్రాణాలు కాపాడవచ్చని పెద్దపల్లి డీ సీపీ రాంరెడ్డి అన్నారు. రామగుండం ఎన్టీపీసీ ధ న్వంతరి ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన అరైవ్ – అలైవ్‌పై గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్, ధన్వంతరి ఆస్పత్రి వైద్య బృందంతో అంబులెన్స్ డ్రైవర్లు, స్వయంసేవకులకు ఫస్ట్ ఎయిడ్, గోల్డెన్ అవర్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగిన వెంటనే తొలిగంట అ త్యంత కీలకమని డీసీపీ తెలిపారు.
గంటలోపే ఆస్పత్రులకు తరలించాలి
యైటింక్లయిన్‌కాలనీ: రోడ్డు ప్రమాదాల్లో గోల్డెన్ అ వర్ చాలాముఖ్యమని డీసీపీ రాంరెడ్డి తెలిపారు. ఆర్జీ–2ఏరియా వృత్తి శిక్షణ కేంద్రంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్‌తో కలిసి మాట్లాడారు. ప్రమాదం జరిగిన గంటలోపే బాధితులను ఆస్పత్రులకు తరలించాలని కోరారు. ఈకార్యక్రమంలో టూటౌన్ సీ ఐ ప్రసాద్‌రావు, పోలీస్ సిబ్బంది, ఎంవీటీసీ ట్రైన ర్, సింగరేణి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


