స్వచ్ఛ రామగుండం లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ రామగుండం లక్ష్యం

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

● మేయర్‌ మహంకాళి స్వామి ● 33వ డివిజన్‌లో పర్యటన

జ్యోతినగర్‌: స్వచ్ఛ రామగుండం లక్ష్యంగా నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ప్రతీఒక్కరు భాగ స్వాములు కావాలని మేయర్‌ మహంకాళి స్వామి కోరారు. 33వ డివిజన్‌లో డిప్యూటి మేయర్‌ పాతిపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్‌ మేరుగు భూలక్ష్మీ తదితరులతో కలిసి శుక్రవారం ఆయన వార్డుబాట చేపట్టారు. అత్యవసర సమయాల్లో వీధుల్లోకి అంబులె న్స్‌ వచ్చేలా తమఇంటి ఎదుట రోడ్డు విస్తరించాలని కోరారు. బల్దియాకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లతోపాటు డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర, అధికారులు రామన్‌, షాబాజ్‌, ఆఫ్తాబ్‌, తేజస్విని, మీర్‌, నవీన్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement