వనమహోత్సవానికి కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

వనమహోత్సవానికి కార్యాచరణ

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

● అధికారులతో బల్దియా కమిషనర్‌ సమీక్ష

● అధికారులతో బల్దియా కమిషనర్‌ సమీక్ష

కోల్‌సిటీ: వన మహోత్సవం విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణ శ్రీ ఆదేశించారు. బల్దియా కార్యాలయంలో గురువా రం వార్డు అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఆమె మా ట్లాడుతూ, మొక్కలు నాటి సంరక్షించడంపై అటవీ శాఖాధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభంలోనే 1,80,000 మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. మొక్కలు నాటాడానికి అనువైన స్థలాల గుర్తింపుతోపాటు ఎలాంటి రకాలు, ఎన్ని నాటాలో సవివరంగా జాబితాలో పొందుపర్చాలన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌కు సంబంధించి రోడ్డు వెడల్పు, విద్యుత్‌ తీగలు, పైప్‌లైన్లు అన్నీ పరిగణనలోకి తీసుకోవాల ని సూచించారు. జనగణన, ఇందిరమ్మ ఇళ్లు, ఆస్తిపన్ను వసూళ్ల పురోగతి, పారిశుధ్యం నిర్వహణపైనా సమీక్షించారు. సమావేశంలో ఈఈ పీవీ రామన్‌, డీఈ షాభాజ్‌, ఏఈ తేజస్విని, అటవీ శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ రహమతుల్లా, డీఆర్‌వో కొమురయ్య, బీట్‌ ఆఫీసర్‌ వరప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement