ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

పాలకుర్తి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ అన్నారు. గురువారం జీడీనగర్‌లోని ఓప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మండలస్థాయి 99రోజుల ప్రణాళిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 130రకాల వ్యాధి నిర్థారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు వివరించారు. ఎస్సై శ్రీధర్‌ అరైవ్‌ – అలైవ్‌ కార్యక్రమం గురించి వి వరించారు. మండల ప్రత్యేకాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, తహసల్దార్‌ సునీత, ఎంపీడీవో శశికళ, ఏఎంసీ చైర్మన్‌ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రజా పాలన–ప్రగతి నివేదిక సమావేశం మొక్కుబడిగా సాగిందనే విమర్శలు వచ్చాయి. మరోవైపు.. సమావేశంలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించలేదని ఉపసర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు ఉపసర్పంచులు ముత్యాల ఉదయ్‌కుమార్‌, ఓడ్నాల జ్యోతి, ఇస్లావత్‌ రాజేశ్వరి తదితరులు ఎంపీడీవోకు వినతిపత్రం సవమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement