రామగుండం: తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గురువారం స్థానిక సబ్ డివిజన్ కా ర్యాలయలో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించింది. వినియోగదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని విని యోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేసే అవకాశం కల్పించినా ఆశించిన స్పందన రాలేదు. విద్యుత్ బిల్లుల్లో హెచ్చుతగ్గులు, లోఓల్టేజీ తదితర సమస్యలపైనే నలుగురైదుగురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏఈ గడ్డం సునీల్‌సాయినాథ్‌రెడ్డితోపాటు రమేశ్ (టెక్నికల్), దేవేందర్ (ఫైనాన్స్), తిరుపతయ్య(ఎస్‌ఏవో, పెద్దపల్లి), అంతర్గాం, పాలకుర్తి ఏఈలు ఆశ శంకర్, ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.


