ఎంపీని కలిసిన విప్‌, ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

ఎంపీని కలిసిన విప్‌, ఎమ్మెల్యే

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలి

పెద్దపల్లి/గోదావరిఖని: రాజ్యసభ సభ్యుడిగా వేంనరేందర్‌రెడ్డి పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేశారు. ఈమేరకు గురువారం తెలంగా ణ భవన్‌లో వేంనరేందర్‌ రెడ్డిని ప్రభుత్వ విప్‌ విజయరమణారావుతోపాటు రామగుండం ఎ మ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ కలిసి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, బొజ్జు పటేల్‌ తదితరులు ఉన్నారు.

వరికోతలు షురూ

పాలకుర్తి: యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. పాలకుర్తి, కొత్తపల్లి, బసంత్‌నగర్‌ గ్రామాల్లో రైతులు వారం రోజులుగా వరికోతలు చేపట్టారు. పాలకుర్తి, బసంత్‌నగర్‌, కొత్తపల్లితోపాటు పెద్దపల్లి మండలంలోని కురుమపల్లి గ్రామాల రైతులు బసంత్‌నగర్‌ విమానశ్రయ ప్రతిపాదిత స్థలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. వీటిని కన్నా ల, అప్పన్పపేట సొసైటీలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వరికోతలు ప్రారంభమైనా కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఏర్పాట్లు చేయకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

గ్యాస్‌ ప్రమాదాలపై అప్రమత్తం

పెద్దపల్లి: వంటగ్యాస్‌ ప్రమాదాల నియంత్రణ విధానంపై ప్రతీ మహిళకు అవగాహన ఉండా లని అగ్నిమాపక శాఖ అధికారి మహేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని జెండా చౌరస్తా ట వర్స్‌లో గురువారం అగ్నిప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించారు. వేసవిలో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, నివారించేందుకు జాగ్రత్తలు పాటించాలని వివరించారు. అధికారులు శ్రీనివాస్‌, అనిల్‌ కు మార్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

సెల్లార్‌లో వ్యాపారం

పెద్దపల్లిరూరల్‌: స్థానిక కమాన్‌ ప్రాంతంలోని కాంప్లెక్స్‌లోని రెండు బ్యాంకుల ఎదుట వాహనాలను రోడ్డుపైనే నిలుపుతున్నారు. భవనంలో వాహనాల పార్కింగ్‌ కోసం సెల్లార్‌ ఉన్నా అందులో వ్యాపారం సాగిస్తున్నారు. దీంతో వాహనాలను ఇలా రోడ్లపైనే నిలపాల్సి వస్తోంది. బ్యాంకు లావాదేవీల కోసం వచ్చే ఖాతాదారులు లోనికి వెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. మున్సిపల్‌, పోలీసు అధికారులు సెల్లార్‌ల వినియోగంపై దృష్టి సారించాలని ఖాతాదారులు కోరుతున్నారు.

తహసీల్దార్‌గా రవీందర్‌రావు

జ్యోతినగర్‌: రామగుండం తహసీల్దార్‌గా కొలు గూరి రవీందర్‌రావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ, రెవెన్యూ సేవలు పారదర్శకంగా కొనసాగుతాయన్నా రు. కాగా, 20 రోజులుగా తహసీల్దార్‌ లేక పలు సంఘాలు నిరసన చేపట్టాయి. ఎట్టకేలకు కలెక్టరేట్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న రవీందర్‌రావును నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశా రు. అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగు చ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కా గా, పాలకుర్తి తహసీల్దార్‌ సునీతను తొలుత రామగుండానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కానీ, గురువారం రవీందర్‌రావును నియమించడం గమనార్హం.

రామగుండం: ఎన్పీడీసీఎల్‌ పర్మినెంట్‌ ఉద్యోగులు, ఆర్టిజన్లకు ఒకేసర్వీస్‌ రూల్స్‌ అమలు చే యాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్‌చేశారు. మల్యాలపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఆర్టిజన్ల దీక్ష తొమ్మిదోరోజుకు చే రింది. సదానందంతోపాటు బీసీ సంఘాల ఐ క్యవేదిక జిల్లా చైర్‌పర్సన్‌ దాసరి ఉష సంఘీభావం ప్రకటించారు. సదానందం మాట్లాడు తూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అ మలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టిజన్లు శ్రీనివాస్‌, సురేశ్‌, మహేశ్‌, విశ్వనాథ్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement