అర్హులందరికీ సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారం

లోపాలుంటే మా దృష్టికి తీసుకురండి

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లిరూరల్‌: సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా యంత్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా కేంద్రంలో గురువా రం నిర్వహించిన మున్సిపల్‌స్థాయి ప్రజాపాలన – ప్రగతిప్రణాళిక సమావేశంలో ఆయన మాట్లాడా రు. రేషన్‌కార్డుల జారీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, పింఛ న్లు, గృహజ్యోతి, రూ.500కే గ్యాస్‌, వడ్డీలేని రుణాలు.. ఇలా అనేక పథకాలు అమలవుతున్నాయ న్నా రు. వీటిఅమలులో లోపాలను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని తెలిపారు. సమస్యలను గుర్తించి క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా అధికారు లు, సిబ్బంది పనిచేయాలని సూచించారు.

రహవీర్‌ పథకం కింద రూ.25వేల నజరానా

రహదారులపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, గంటలోపే బాధితులను ఆస్పత్రికి తరలించే వారికి రహవీర్‌ పథకం కింద రూ.25వేల నజరానా అందిస్తామని కలెక్టర్‌ ప్రకటించారు. డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ మాట్లాడారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

వందశాతం లక్ష్యం సాధించాలి

పెద్దపల్లి: స్వశక్తి సంఘాల ఆదాయాభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాలను వంద శాతం సాధించడానికి సెర్ప్‌ సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సెర్ప్‌ కార్యకలాపాలపై అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం ఆయన సమీక్షించారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ లింకేజీలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఇందుకు కృషిచేసిన సిబ్బందిని కలెక్టర్‌ అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రుణాల పంపిణీ, రికవరీలో ముందంజలో ఉంచాలని ఆయన కోరారు. మహిళ శిక్షణ సంస్థ వీ హబ్‌ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, అదనపు డీఆర్డీవో రవీందర్‌, డీపీఎంలు వెంకటరమణ, సంజీవ్‌, సీ్త్రనిధి ఆర్‌ఎం దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement