ఆపదలో ఆస్పత్రికి తరలిస్తే ప్రోత్సాహకం | - | Sakshi
Sakshi News home page

ఆపదలో ఆస్పత్రికి తరలిస్తే ప్రోత్సాహకం

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

● పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి

● పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి

గోదావరిఖని: ప్రమాదంలో గాయపడిన వారిని ఆ స్పత్రికి తరలిస్తే రహవీర్‌పథకం కింద రూ.25వేలు పోత్సాహకంగా అందిస్తామని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. గురువారం అడ్డగుంటపల్లి కెమిస్ట్‌భవన్‌లో వన్‌టౌన్‌సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, ట్రాఫిక్‌ సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్సై రమేశ్‌, ఐఎంఏ అధ్యక్షుడు శ్రీనివాస్‌, మెడికల్‌ షాప్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజేందర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించాలి

పెద్దపల్లిరూరల్‌: వాహనదారులు రోడ్‌సేఫ్టీ నిబంధ నలను కచ్చితంగా పాటించి సురక్షితంగా తిరిగి చే రుకోవాలని డీసీపీ రాంరెడ్డి అన్నారు. రూరల్‌ ఎస్సై మల్లేశ్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన అరైవ్‌ .. అలైవ్‌ కార్యక్రమంలో ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఇన్‌చార్జి డీపీవో నరేందర్‌, స్పెషల్‌ఆఫీసర్‌ రాజేశ్వర్‌తో కలిసి మాట్లాడారు. వాహనాలను నిర్లక్ష్యంగా, మత్తులో నడిపి ప్రమాదాలకు గురికావొద్దని సూచించారు. బైక్‌పై ప్రయాణించేవారు తప్పకుండా హెల్మెట్‌, కారు నడిపేవారు సీటుబెల్ట్‌ ధరించాలని ఆయన సూచించారు. సమావేశానికి హాజరైన సర్పంచులు, ఉపసర్పంచులు, కార్యదర్శులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజయ్య, ఎంపీడీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement