‘రైజింగ్‌ రామగుండం’ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

‘రైజింగ్‌ రామగుండం’ లక్ష్యం

Apr 16 2026 9:54 AM | Updated on Apr 16 2026 9:54 AM

కోల్‌సిటీ: రైజింగ్‌ రామగుండంగా అభివృద్ధి చేసేందుకు ప్రతీపౌరుడు కదిలి రావాలని, ఊరంటే రామగుండంలా ఉండాలనేలా నగరాన్ని రూపుదిద్దుకోవడానికి సహకారాన్ని అందించాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ కోరారు. ప్రజాపాలన .. ప్రగ తి ప్రణాళికలో భాగంగా బుధవారం 9వ డివిజన్‌ లో నిర్వహించిన వార్డుసందర్శనలో మేయర్‌ మ హంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆ యన మాట్లాడుతూ, రామగుండాన్ని స్వచ్ఛమైన, అద్భుత నగరంగా తీర్చిదిద్దడం పౌరుల భాగస్వామ్యంతోనే సాధ్యమన్నారు. నాలాల పూడికతీత ద శాబ్దాలుగా లేదని, ప్రస్తుతం సమర్ధత, అనుభవం కలిగిన పాలకవర్గం ఏర్పడిందని, శానిటేషన్‌తోపా టు అన్నిసమస్యలూ తీరిపోతాయని తెలిపారు. వ రద ముప్పుతోపాటు దుర్గంధం నుంచి విముక్తి క ల్పించేందుకు త్వరలో కాంక్రీట్‌ కాలువలు నిర్మిస్తా మని చెప్పారు. మేయర్‌ మహంకాళి స్వామి మాట్లాడుతూ, కాలువలో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా వినోభానగర్‌, రెల్లివాడలోని మురుగునీటి కాలువలో పూడిక తొలగించారు. డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్‌ తాళ్లపెల్లి యుగంధర్‌తోపాటు పలువురు కా ర్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, ఈ ఈ పీవీ రామన్‌, టీపీఎస్‌ నవీన్‌, ఏఈ జమీల్‌, శాని టరీ ఇన్‌స్పెక్టర్‌ నాగభూషణం, సూపర్‌వైజర్‌ రవికుమార్‌, ఎలక్ట్రికల్‌ ఏఈ రాంజీ పాల్గొన్నారు.

అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసి రావాలి

ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పిలుపు

మేయర్‌తో కలిసి తొమ్మిదో డివిజన్‌లో వార్డుబాట

Advertisement
 
Advertisement
Advertisement