పెద్దపల్లి: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను గడువులోగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టరేట్‌లో బుధవారం ఆయన సమీక్షించారు. వి ద్యా సంస్థల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, నూతన తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వేగవంతం చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాల పనులను జూన్ నాటికి పూర్తిచేయాలని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులను మే 15లోగా పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ పీఆర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
భూసమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు
కాల్వశ్రీరాంపూర్: భూ, రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. వెన్నంపల్లి, కూనారంలోని వ్యవసా య భూములను కలెక్టర్ పరిశీలించారు. ఆన్‌లైన్ ద్వారా అందిన భూభారతి దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అ ధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దా ర్ రాముడు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు


