జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించినట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపల్ సర్దార్ బాషా తెలిపారు. బుధవారం సాయంత్రం విడుదలైన సీబీఎస్‌ఈ ఫలితాల్లో 50 మంది విద్యార్థులకు 50 మంది ఉత్తీర్ణత సాధించారని ఆయన పేర్కొన్నారు. బైరం నీలొత్పల 468/500తో 93.6 శాతం, జోషన్ జాబీ 452/500తో 90.4 శాతం, ఇషితా గ్రేసీ 445/500తో 89 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడంపై ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌తోపాటు ఉపాధ్యాయులు అభినందించారు.
ఇషితా గ్రేసీ
నీలోత్పల
జోషన్‌జాబీ
వందశాతం ఉత్తీర్ణత నమోదు


