రాజ్యాంగ విలువల పరిరక్షణే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ విలువల పరిరక్షణే లక్ష్యం

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

పెద్దపల్లి/మంథని/గోదావరిఖని: రాజ్యాంగ విలువల పరిరక్షణే లక్ష్యమని ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా పెద్దపల్లి, గోదావరిఖని, మంథని ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. పెద్దపల్లి బస్టాండ్‌ వద్ద ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌తో కలిసి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మంథనిలోనూ అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నివాళి అర్పించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, రాజ్యాంగం రచనలో అంబేడ్కర్‌ కీలకపాత్ర పోషించారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని సూచించారు. అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్‌కు సూ చించారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వ పాలన సా గుతోందని, అంబేడ్కర్‌ ఆలోచన ఆదర్శనీయమని మంత్రి అన్నారు. మంథనిలో అంబేడ్కర్‌ స్టడీ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. నిష్ణాతులైన ప్రొఫెసర్లతో శిక్షణ అందించి పోటీ పరీక్షలకు తయారు చేస్తామని శ్రీధర్‌బాబు చెప్పారు.

మహిళలను కోటీశ్వరులను చేస్తాం

మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్‌ ప్ర భుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్ర భుత్వ విప్‌ విజయరమణారావు, రామగుండం ఎ మ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి జిల్లా కేంద్రంలో వీ హబ్‌ సెంటర్‌ ప్రారంభించిన అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. పెద్దపల్లికి వీ హబ్‌ తీసుకురావడంలో ప్రభుత్వ విప్‌ విజయరమణారావు కృషి ఎంతగానో ఉందన్నారు. రోబోటిక్స్‌, ఏఐ సాంకేతికతలు అతివేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, భవిష్యత్‌లో వీ టిద్వారా విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. డిజిటల్‌ లిటరసీ సమ్మర్‌ క్యాంపులకు పైలట్‌ ప్రాజెక్టుగా రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ను ఎంపిక చేస్తామని మంత్రి చెప్పారు. కలెక్టర్‌ శ్రీహర్ష మాట్లాడుతూ, అడవిశ్రీరాంపూర్‌, కాల్వశ్రీరాంపూర్‌లో ప్రారంభించిన ఏఐ ల్యాబ్‌ అన్ని పాఠశాలలకు విస్తరిస్తామన్నారు. ప్ర భుత్వ విప్‌ విజయరమణారావు మాట్లాడుతూ, అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌కు రూ.5 కోట్లు మంజూ రు చేయాలని మంత్రి శ్రీధర్‌బాబును కోరారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, అంబ్కేడ్కర్‌ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతా ల్లో జరిగిన కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ వేణు, డీసీపీ రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి ర వీందర్‌, టీ ఫైబర్‌ ఎండీ శివప్రసాద్‌, వీ హబ్‌ సీఈ వో సీత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని, మంథని మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న, ఎస్సీసెల్‌ డివిజన్‌ అ ధ్యక్షుడు మంథని సత్యం, మాజీ ఎంపీపీ కొండ శంకర్‌, నాయకులు తోకల మల్లేశ్‌, నూకల బానయ్య, కమల్‌, బూడిద శంకర్‌, ఎరుకల ప్రవీణ్‌, శశిభూష ణ్‌ కాచే, ఎల్లంకీ వంశీ తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహాలు విరాళం

తన సొంతంగా రాష్ట్రంలో 100 అంబేడ్కర్‌ విగ్రహా లు దానం చేశానని మంత్రి గడ్డం వివేక్‌ అన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్‌ అని అన్నారు. అనంతరం మంత్రిని స్థానికులు సన్మానించారు.

స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్‌

ప్రతీవర్గానికి స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్‌ అని పెద్దప ల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆ యన మాట్లాడుతూ, బడుగు, బలహీనవర్గాల ఆ శాజ్యోతి అంబేడ్కర్‌ అని అన్నారు. డీలిమిటేషన్‌ ప్ర క్రియతో దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర జరుగుతోంద ని, అలాకాకుండా అందరికీ సమాన న్యాయం క ల్పించాలని అన్నారు. బీజేపీ స్వలాభం కోసం డీలిమిటేషన్‌ను ఉపయోగించుకుంటోందన్నారు.

అంబేడ్కర్‌కు నివాళి

గోదావరిఖని: ఆర్జీ–1 జీఎం లలిత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌కు నివాళిఅర్పించారు.

అంబేడ్కర్‌ ఆదర్శప్రాయుడు

జ్యోతినగర్‌: అంబేడ్కర్‌ ఆదర్శప్రాయుడని ఎన్టీపీసీ ఈడీ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. అంబేడ్క ర్‌కు నివాళి అర్పించారు. ప్రధాన దుకాణ సముదాయంలో ప్రభాత్‌ భేరీ వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. కాకతీయ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

నివాళి అర్పిస్తున్న ఎంపీ వంశీకృష్ణ

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి వివేక్‌

పెద్దపల్లిలో జరిగిన వేడుకలకు హాజరైన ప్రజలు, ప్రముఖులు

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

ఘనంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి

నివాళి అర్పించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు

Advertisement
 
Advertisement
Advertisement