‘అరైవ్‌ – అలైవ్‌’ ప్రతిజ్ఞ చేసిన మంత్రి | - | Sakshi
Sakshi News home page

‘అరైవ్‌ – అలైవ్‌’ ప్రతిజ్ఞ చేసిన మంత్రి

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

గోదావరిఖని: అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మంగళవారం నగరంలో నిర్వహించిన అరై వ్‌–అలైవ్‌ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌, పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా, రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి, ఏసీపీ రమేశ్‌ రక్షణ ప్రతిజ్ఞ చేశారు. ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌, వన్‌ టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు రమేశ్‌, అనూష తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ

ధర్మారం: స్థానిక మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ విద్యార్థి సంపతి రక్షిత రాష్ట్రస్థాయి సీనియర్‌ ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ హైమార్‌త్రో పోటీల్లో మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించినట్లు పీఈటీ కొమురయ్య తెలిపారు. ఈనెల 11, 12వ తేదీల్లో హన్మకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్‌ –20లో ప్రతిభ చూపినట్లు వివరించారు. రక్షితను ప్రిన్సిపాల్‌ ఈరవేని రాజ్‌కుమార్‌ అభినందించారు. వ్యాయామ ఉపాధ్యాయులు బైకని కొమురయ్య, మేకల సంజీవరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కాలేజీకి ప్రశంసలు

రామగుండం: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో అత్యధిక ఫలితాలు సాధించిన స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా ప్రశంసించారు. మంగళవారం జరిగిన జూమ్‌ మీటింగ్‌ ద్వారా ప్రిన్సిపాల్‌ చింతల మోహన్‌తోపాటు అధ్యాపకులను అభినందించారు. ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో 98.3శాతం ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్రస్థాయిలో మూడోస్థానం దక్కించుకుంది. కంప్యూటర్‌ సైన్స్‌లో రఘుమున్ను స్వామి 992/1000, ఫస్టియర్‌లో రామ్‌ దివ్యశ్రీ 491/500, ఎంపీసీలో బుష్రా తహరీమ్‌ 974/1000, హెచ్‌ఈసీలో పల్లె జశ్వంత్‌ 910/1000 మార్కులు సాధించడంపై యోగితారాణా సంతృప్తి వ్యక్తం చేశారు.

శభాష్‌ సతీశ్‌

మంథనిరూరల్‌: సాధార ణంగా మహనీయుల వ ర్ధంతి, జ యంతి సందర్భంగా వారి చిత్రపటాలు, విగ్రహాలకు పూలదండలు వేసి నివాళి అ ర్పించడం ఆ నవాయితీ. అందుకు భిన్నంగా ఉప్పట్ల గ్రామానికి చెందిన యువకుడు బడికెల సతీశ్‌.. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మంగళవారం తన స్కూటీపై అంబేడ్కర్‌ ఫొటో పెట్టి, పూలదండ వేసి నివాళి అర్పించాడు. వాహనంపై తిరుగుతూ విస్తృత ప్రచారం చేశాడు.

‘పాకెట్‌మనీ’ నొక్కితే ఖాతా ఖాళీ

పెద్దపల్లిరూరల్‌: సైబర్‌ నేరగాళ్లు సరికొత్త ఎత్తులు వేస్తూ అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నిత్యజీవితంలో డిజిటల్‌ చెల్లింపులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గూగుల్‌ పే ద్వారా చెల్లింపులు చేసేందుకు యాప్‌ ఓపెన్‌ చేయగానే తొలుత ‘పాకెట్‌మనీ’ అనే సింబల్‌ కనిపిస్తోంది. దానిని నొక్కితే బ్యాంకు ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతున్నాయట. డిజిటల్‌ పేమేంట్‌ చేసే వారంతా తమకు అవసరం లేనియాప్‌, లింకుల జోలికి వెళ్లక పోవడమే మంచిదని పోలీసు అధికారులు పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement