కోల్‌సిటీ(రామగుండం): మద్యపానం, ధూమపా నం, డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలు బ లమైనవి. మనిషిని బలహీనుడిని చేసేవి. ఒకసారి అలవాటుపడితే మానుకోవవడం అతికష్టం. ‘మ త్తు’ జీవితాలను చిత్తు చేస్తున్నది. ఆ మైకంలోపడి యువత బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటోంది. అంతేకాదు.. వారి కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. మత్తుకు బానిసలుగా మారిన వారిని వ్యసనం మాన్పించేందుకు ప్రభుత్వం జిల్లాకో అ డిక్షన్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీ(ఏటీఎఫ్) కేంద్రాన్ని ఏ ర్పాటు చేస్తోంది. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఏటీఎఫ్ కేంద్రాన్ని ప్రారంభించారు.
చికిత్స రెండు విధాలుగా..
మత్తుకు బానిసలైన వారిని మాన్పించేందుకు జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కేంద్రంలో అక్యూట్, క్రానిక్ అనే రెండు పద్ధతుల్లో చికిత్స అందిస్తున్నా రు. అక్యూట్ పద్ధతిలో సబ్‌స్టెన్స్ ఇన్‌టాక్సికేషన్ కేర్ యూనిట్(ఎస్‌ఐసీయూ)ద్వారా ఇన్‌పేషెంట్లకు చికి త్స అందిస్తుండగా, క్రానిక్ విధానంలో డ్రగ్ అడిక్షన్ కౌన్సెలింగ్ సెంటర్(డీఏసీసీ) ద్వారా ఔట్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. డీ అడిక్షన్ కేంద్రాన్ని ఏడాది క్రితమే జీజీహెచ్‌లో ఏర్పాటు చేయగా, ప్రస్తుతం సేవలు విస్తృతమయ్యాయి.
10 పడకలతో ఏటీఎఫ్ వార్డు
జీజీహెచ్‌లో ఏటీఎఫ్ కేంద్రం కోసం 10 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి రూమ్ నంబర్ –6లో ప్రత్యేక ఓపీ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఇందుకోసం సిబ్బందిని నియమించారు. ప్రతీనెల బాధి తుల సంఖ్య పెరుగుతోంది. కొందరు వ్యసనపరు లు చికిత్సతో సాధారణ జీవితం గడుపుతుండగా, మరికొందరు నెల, రెండు, మూడు నెలల తర్వాత మళ్లీ వ్యసనాలకు బానిసవుతున్నారు. మానసిక చికిత్స విభాగం ఓపీకి ప్రతీ నెల 300 నుంచి 250 మంది వరకు ఇన్‌పేషెంట్లు వస్తుండగా, ఇందులో 50 నుంచి 70 మంది వరకు మత్తుబానిసలు ఇన్‌పేషెంట్లుగా చేరి ట్రీట్‌మెంట్ పొందుతున్నారు.
చికిత్స పొందిన ఇన్‌పేషెంట్లు
మార్చి 45
ఏప్రిల్ (ఇప్పటివరకు) 05
జనవరి 55
ఫిబ్రవరి 69
జీజీహెచ్‌లో ఏటీఎఫ్ కేంద్రం
10 పడకలతో మానసిక చికిత్సవార్డు
వ్యసనపరులకు ఉచిత వైద్యసేవలు
తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం
పుట్టుకతోనే ఎవరూ మత్తుకు బానిసలుకారు. చుట్టూ ఉన్న వాతావరణం, చెడు స్నేహాలు, మానసికస్థితి, కుటుంబ చరిత్ర.. ఇలా అన్నీ కలిసి ఆ ఊబిలోకి నెట్టేస్తాయి. చిన్నారులు కూడా మత్తుకు బానిసలవుతున్నారు. దీనికి తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం. చిన్న అనుమానం వచ్చినా ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకట్ట వేయాలి. కౌమారంలో పిల్లలకు వ్యక్తిత్వం, ఆరోగ్యకరమైన జీవన శైలిని ఇవ్వాలి. మత్తుకు బానిసలైన వారికి జీజీహెచ్‌లో ఉచితంగా చికిత్స, కౌన్సెలింగ్ ఇచ్చి పునర్జన్మ కల్పిస్తున్నాం. ఏటీఎఫ్ కేంద్రాలు మత్తు వ్యసనపరులకు ఒక వరం. – సైకియాట్రిస్ట్ రవివర్మ, జీజీహెచ్


