రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని కమాన్‌ ఏరియాలో ప్రమాదాల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కమాన్‌ ఏరియాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే వివిధ ప్రాంతాలను డీసీపీ రాంరెడ్డితో కలిసి మంగళవారం కలెక్టర్‌ పరిశీలించారు. రోడ్డు ప్రమాదం కుటుంబానికి తీవ్ర మానసిక, ఆర్థికభారం కలిగిస్తుందన్నారు. ప్రతీ ప్రమాదాన్ని అ త్యంత తీవ్రంగా పరిగణించి నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ నియంత్రణ కో సం సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలని, వాహనాల వే గాన్ని తగ్గించేందుకు రబ్బర్‌ స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రివేళ స్పష్టంగా కనిపించే రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు అమర్చడం ద్వారా విజిబిలిటీ పెంచాలని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌, ఏసీపీ కృష్ణ, ట్రాఫిక్‌ సీఐ అనిల్‌ కుమార్‌, ఎస్‌ఐ లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement